Balakrishna: ఇంతమంది ఉండి ఏం చేశారు..? మా అసోషియేషన్ కు బాలయ్య సూటి ప్రశ్న..

నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మెమరబుల్ హిట్ గా నిలిచిన సినిమా ఆదిత్య 369. ఆ సినిమా విడుదలై సరిగ్గా 30 ఏళ్ళు అయ్యింది. తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటి టైమ్ ట్రావెల్ కాసెప్టెడ్ మూవీ.

Balakrishna: ఇంతమంది ఉండి ఏం చేశారు..? మా అసోషియేషన్ కు బాలయ్య సూటి ప్రశ్న..
Balakrishna
Follow us

| Edited By: Rajeev Rayala

Updated on: Jul 20, 2021 | 1:12 PM

Balakrishna: నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో మెమరబుల్ హిట్ గా నిలిచిన సినిమా ఆదిత్య 369. ఆ సినిమా విడుదలై సరిగ్గా 30 ఏళ్ళు అయ్యింది. తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటి టైమ్ ట్రావెల్ కాసెప్టెడ్ మూవీ. సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ నాటి జ్ఞాపకాలను సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలను పంచుకున్నారు బాలయ్య. టీవీ 9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు బాలయ్య. ఆదిత్య 369 సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందన్నారు నటసింహం. అలాగే చాలా మంది హీరోలు తనను అనుకరించారని అన్నారు బాలయ్య. అలాగే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని తాను మాత్రమే కాదు చిత్రయూనిట్ అంతా సినిమా కోసం చాలా కష్టపడ్డామని అన్నారు. ఇక సినిమా కు సీక్వెల్ నేనే తీస్తానని అన్నారు బాలయ్య. సీక్వెల్ కు ఆదిత్య 999 మాక్స్ అనే టైటిల్ పెడుతున్నానని అన్నారు. అలాగే మా అసోసియేషన్ ఎన్నికల పైన బాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారన్నది తనకు అనవసరం అన్నారు బాలయ్య. ఇంతమంది ఉండి కూడా మా బిల్డింగ్ ఎందుకు కట్టలేక పోయారని సూటిగా ప్రశ్నించారు బాలకృష్ణ .

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అడిగితే భూములు ఇవ్వవా అని ప్రశ్నించారు బాలకృష్ణ. కొంతమంది ప్రభుత్వాలతో రాసుకుపూసుకు తిరిగుతున్నారని సెటైర్ వేశారు బాలకృష్ణ. ఇంతకు ముందు ఫండ్ రైజ్ అంటూ అమెరికాకు అక్కడికి ఇక్కడికి విమానాల్లో తిరిగారని అన్నారు బాలయ్య. మంచు మనోజ్ ముందుకొచ్చి సొంత డబ్బులతో బిల్డింగ్ కడితే నేను కూడా అందులో భాగస్వామిని అవుతానని అన్నారు బాలకృష్ణ. అలాగే అఖండ సినిమా విషయాలను కూడా పంచుకున్నారు బాలయ్య. సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు వచ్చిందని. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చిందని, తప్పకుండా ప్రేక్షుకులను ఆకట్టుకుంటుందని అన్నారు బాలకృష్ణ.

మరిన్ని ఇక్కడ చదవండి :

Raj Kundra : శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కు కారణం ఆమేనా.. అసలు విషయం ఏంటంటే..

Raj Kundra: రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మోడల్.. వీడియో కాల్ లో అలా..

Boyapati Srinu : యాక్షన్ హీరోతో బోయపాటి భారీ ప్లాన్.. బాలయ్య సినిమా తర్వాత ఆ హీరోతోనేనా..?