Pallavi Prashanth: ఎట్టకేలకు రైతుబిడ్డకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు

బిగ్ బాస్ ఫినాలే తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ను అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నేడు పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. 15 వారలు హౌస్ లో ఉన్న అతను విన్నర్ గా నిలిచాడు. అయితే ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొంతమంది విధ్వంసం సృష్టించారు.

Pallavi Prashanth: ఎట్టకేలకు రైతుబిడ్డకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Pallavi Prashanth

Updated on: Dec 22, 2023 | 5:40 PM

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. బిగ్ బాస్ ఫినాలే తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ను అతని సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నేడు పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. 15 వారలు హౌస్ లో ఉన్న అతను విన్నర్ గా నిలిచాడు. అయితే ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొంతమంది విధ్వంసం సృష్టించారు. ఆర్టీసీ బస్సుతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ తో పాటు మరికొంత మందిను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కోర్టులో విచారణల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అలాగే ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలని ఆదేశించింది. దాంతో పాటు 15 వేలు రుపాయలుతో రెండు షూరిటీలు సమర్పించాలి నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ ను ఆదేశించింది.

ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పెద్ద గొడవే జరిగింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకు భారీగా చేరుకున్నారు. దారిన పోయే వాహనాల పై పైశాచికంగా దాడి చేశారు. అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని కార్ల పై దాడి చేశారు కొందరు. అలాగే అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై కూడా దాడి చేశారు. అభిమానులను కంట్రోల్ చేయడనికి వచ్చిన పోలీసుల పై రాళ్లు రువ్వడంతో పాటు పోలీస్ వాహనాలపై కూడా దాడికి తెగబడ్డారు. ప్రశాంత్ తమ మాట వినలేదని.. లా అండ్ ఆర్డర్ ఇష్యు ఉంది అని చెప్పినా కూడా తమ మాట వినకుండా అభిమానులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడని పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.