Wild Dog Movie Success Meet: యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటున్న నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్..

wild dog collection: కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా శుక్రవబరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బాంబు పేలుళ్ల  నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Wild Dog Movie Success Meet: యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటున్న నాగార్జున సినిమా.. వైల్డ్ డాగ్ సక్సెస్ మీట్..
Nagarjuna 1

Edited By:

Updated on: Apr 04, 2021 | 10:06 PM

Wild Dog Movie  కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా శుక్రవబరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బాంబు పేలుళ్ల  నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో  నాగార్జున నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపించాడు. బాంబు దాడులు జరిపిన టెర్రరిస్టులను నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీగా ప‌నిచేసే విజ‌య్ వ‌ర్మ ఎలా తుద‌ముట్టించాడనే విష‌యాన్ని సినిమాలో చూపించారు. ఈ యాక్షన్ మూవీకి  డైరెక్టర్ అహిషోర్ సాల్మన్ దర్శకతవఫామ్ వహించారు. ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా బాలీవుడ్ క్వీన్ దియామీర్జా నటించింది. టెర్రరిజం నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అన్నింట్లోనూ దేశంలో బాంబులు పెట్టి మరో దేశానికి పారిపోయిన టెర్రరిస్టును.. హీరో అండ్ టీం వెళ్లి తీసుకొస్తారు లేదంటే చంపేస్తారు. నాగార్జున వైల్డ్ డాగ్ కూడా అలాంటి సినిమానే. యదార్థ సంఘటనలను తీసుకొని ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు సోలమన్. తొలి రోజుకు గాను ఈ మూవీ 1.33 షేర్, 2.60 కోట్ల గ్రాస్ రాబట్టింది వైల్డ్ డాగ్. నైజాం- 53 లక్షలు,సీడెడ్‌- 19 లక్షలు,ఉత్తరాంధ్ర- 16 లక్షలు,ఈస్ట్‌ గోదావరి- 7 లక్షలు,వెస్ట్‌ గోదావరి- 6 లక్షలు,గుంటూరు- 7 లక్షలు,కృష్ణా- 8 లక్షలు,నెల్లూరు- 5 లక్షలు,రెస్ట్ ఆఫ్ ఇండియా 6 లక్షలు,ఓవర్సీస్ 6 లక్షలు వసూల్ చేసింది వైల్డ్ డాగ్.  తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి :

సినిమాల్లోకి అడుగు పెట్టిన వీరప్పన్ కూతురు.. తండ్రి స్టైల్ లో గన్ పట్టుకొని ఫోజ్ ఇచ్చిన విజయలక్ష్మీ

Kangana Ranaut -Samantha: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్స్ ట్వీట్స్.. కంగనా ను క్వీన్ అంటూ పొగిడిన సమంత..

Pushpa Movie : ‘పుష్ప’నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ .. అడవిలో బన్నీ మెరుపు పరుగు