Nagarjuna Akkineni : నాగార్జున ‘బంగార్రాజు’ సినిమా పట్టాలెక్కేది ఇంకెప్పటికో ఎప్పటికో..

అక్కినేని నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షులముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది.

Nagarjuna Akkineni : నాగార్జున బంగార్రాజు సినిమా పట్టాలెక్కేది ఇంకెప్పటికో ఎప్పటికో..
Nagarjuna

Updated on: Apr 03, 2021 | 11:45 AM

Nagarjuna Akkineni : అక్కినేని నాగార్జున ఇటీవల వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షులముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దర్శకుడు అహిషోర్ సాల్మోన్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ వైల్డ్ డాగ్. నాగ్ సరసన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హీరోయిన్‏గా నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో సయామీ ఖేర్ కీలక పాత్రలో నటించింది. దీనికి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమా తర్వాత నాగ్  ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది. అయితే నాగార్జున బంగార్రాజు సినిమా చేస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. 00

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలించింది.  ఈ సినిమాలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు క్యారెక్టర్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ కానీ ఈ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. అనుకోని కారణాల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూనే వస్తుంది. తాజాగా మరో సారి ఈ సినిమా వార్త తెరపైకి వచ్చింది. ఇటీవల నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ బంగార్రాజు సినిమా పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా సాగుతుందని అన్నారు నాగ్. దాంతో ఈ ఏడాది కూడా బంగార్రాజు సినిమా పట్టాలెక్కే అవకాశం లేదని తెలుస్తుంది. కథలో చాలా మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. ఈలోగా నాగ్ మరో సినిమా చేసే అవకాశం కూడా ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sandeep Raj: స్టార్ హీరోకోసం కథను సిద్ధం చేసిన కలర్ ఫోటో డైరెక్టర్.. ప్రముఖ నిర్మాణ సంస్థతో సినిమా..

Love Story Movie: మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నాగచైతన- సాయిపల్లవి లవ్ స్టోరీ

Anasuya Bharadwaj : మీకు పెళ్లింది అయ్యింది కదా అందుకే ప్రపోజ్ చేయలేదు.. అనసూయ వీడియోపై నెటిజన్ల కొంటె కామెంట్లు..

Loading...
Unable to load recommendations.
Follow Us