
సాధారణంగా మన దేశంలో పెళ్లిళ్లంటే హడావిడి మాములుగా ఉండదు. లగ్న పత్రికల నుంచి వివాహ విందుల దాకా అన్నీ అంగరంగ వైభవంగా జరపాలనుకుంటారు. అందులోనూ సెలబ్రిటీల పెళ్లి వేడుకలంటే ఆడంబరాలు, ఆర్భాటాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. టాలీవుడ్ హీరో నాగశౌర్య పెళ్లి విషయంలోనూ ఇదే జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో అతను ఏడడుగులు నడించారు. బెంగళూరు నగరంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్బంగా నాగశౌర్య సంప్రదాయ పట్టు పంచెకట్టులో మెరిసిపోగా, వధువు ఎరుపు, బంగారు వర్ణం పట్టుచీరలో.. స్టన్నింగ్ డైమండ్ సెట్ ధరించి చాలా అందంగా కనిపించింది. కాగా నాగశౌర్య పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, మెహందీ, సంగీత్ వేడుకల్లో నాగ శౌర్య తన భార్యతో డాన్స్ చేసిన ఫొటోలు, వీడియోలు అందరినీ ఆకట్టుకున్నాయి.
కాగా నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచింది. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్ లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..