
అక్కినేని నాగచైతన్య (Akkineni ) ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. గతేడాది శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఫాంలోకి వచ్చాడు చై.. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా బంగార్రాజు సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. అక్కినేని నాగార్జున, చైతూ కలిసి నటించిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి కీలకపాత్రలలో నటించారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సిక్వెల్‌గా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ప్రస్తుతం చైతూ.. థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేశాడు. తాజాగా చైతూ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మేకర్స్.
నాగ చైతన్య హీరోగా డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న చైతూ 22వ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరెకెక్కిస్తున్నాయి. నావెల్ కంటెంట్‌తోపాటు సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు తన `మానాడు` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. రామ్ నటిస్తున్న `వారియర్, బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్ చిత్రంతో సహా కొన్ని సెన్సేషనల్ ప్రాజెక్ట్ లను చేయబోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్లో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకాకాలంలో రూపొందబోతున్న ఈ చిత్రాన్ని హైటెక్నికల్ స్టాండర్డ్స్ తో భారీ బడ్జెట్లో నిర్మించనున్నారు. కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు, అనుభజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Also Read: Viral Photo: ఈ ఇద్దరు చిన్నారులు అమ్మాయిల ఫేవరేట్ హీరోస్.. ఈ బ్రదర్స్ ఇద్దరి క్రేజ్ వేరేలెవల్..
Anjali: క్రేజీ అప్డేట్.. రామ్ చరణ్, శంకర్ సినిమాలో అంజలి ?.. ఏ పాత్రలో అంటే..
Samantha: విడాకుల తర్వాత తొలిసారి నాగచైతన్య ఫోటో షేర్ చేసిన సమంత.. ఎందుకంటే..