Nabha Natesh : ఇదే నా తొలి రీమేక్ సినిమా అంటున్న ఇస్మార్ట్ హీరోయిన్.. నితిన్ సినిమాలో నభనటేష్

యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభనటేష్. ఆతర్వాత  టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శశకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది.

Nabha Natesh : ఇదే నా తొలి రీమేక్ సినిమా అంటున్న ఇస్మార్ట్ హీరోయిన్.. నితిన్ సినిమాలో నభనటేష్
Nabha Natesh

Updated on: Apr 07, 2021 | 8:10 AM

Nabha Natesh : యంగ్ హీరో సుదీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ నభనటేష్. ఆతర్వాత  టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శశకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. ఈ సినిమా తో నభనటేష్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. అందంతోపాటు నటనతో ఆకట్టుకున్న నభనటేష్ ఆతర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాల్లో  నటించి ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ వయ్యారి యంగ్ హీరో నితిన్ తో జతకట్టనుంది. కుర్ర హీరో నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రాధికా ఆప్టే చేసిన పాత్రలో నభా కనిపించనుంది. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చితరంలో నితిన్ కలులేనివాడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాభ మాట్లాడుతూ.. మొదటిసారి ఓ రీమేక్ సినిమాలో మేక్ రీమూవీలో తనకు ఆఫర్ చేసిన పాత్రలో నటించడం ఛాలెంజింగ్ అని కూడా అంది. ఒకటికి రెండు సార్లు చూశాకే ఈ పాత్రకు అంగీకరించానని.. ఒక మంచి చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక నితిన్ ఇటీవల చెక్ , రంగ్ దే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వీటిలో చెక్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది. రంగ్ దే సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తో దూసుకుపోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ravi Teja : మరో సారి మాస్ రాజా సినిమా గురించి టాక్.. రవితేజ కోసం అదిరిపోయే కథను సిద్ధంచేస్తున్న దర్శకుడు

పోలీస్‌ డ్రెస్‌లో అతడిని చూసి జెలసీ ఫీలవుతున్నా..! సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటున్న వెటరన్‌ హీరో..

ఆ రోజే మా ఎంగేజ్‌మెంట్..! ఆహ్వాన పత్రిక కూడా రెడీ..? అసలు విషయాన్ని వెల్లడించిన గ్లామర్‌ బ్యూటీ..

ఆ రోజే మా ఎంగేజ్‌మెంట్..! ఆహ్వాన పత్రిక కూడా రెడీ..? అసలు విషయాన్ని వెల్లడించిన గ్లామర్‌ బ్యూటీ..

Loading...
Unable to load recommendations.
Follow Us