
ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. ప్రతిశుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త కొత్త సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే బడా సినిమాలు పెద్దగా ఈ సమ్మర్ లో విడుదల కాలేదు. జూన్ లో పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.. ఆవెంటనే అఖిల్ లెనిన్, నాని ప్యారడైజ్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఓటీటీలో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్. ప్రేక్షకులు కూడా ఓటీటీలో ఇలాంటి సినిమాలకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓ రొమాంటిక్ సిరీస్ ఓటీటీని ఊపేస్తోంది. ఇటీవలే ఓ రొమాంటిక్ సిరీస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. ఈ రొమాంటిక్ సినిమా చాలా ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఈ సిరీస్ లో మూడు క్యారెక్టర్ల మధ్య తిరుగుతుంది. క్లాస్ లోని ఓ అబ్బాయిని ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. అయితే ఆ అబ్బాయికి దగ్గర కావడం కోసం మరో అబ్బాయితో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు డ్రామా ఆడుతుంది ఆ అమ్మాయి. అయితే ఊహించని విధంగా ఈ ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ఆతర్వాత ఏం జరిగింది అనేది సిరీస్ లోనే చూడాలి.
ఈ సిరీస్ పేరు.. ఆఫ్ క్యాంపస్ వెబ్ సిరీస్ సీజన్ 1 స్టోరీ. ఇందులో ఐస్ హాకీ టీమ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటుంటాయి. ఆఫ్ క్యాంపస్ మొదటి సీజన్ ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ నేపథ్యంలోనే ఉంటుంది. భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది ఈ సిరీస్ లో చూపిస్తారు. ఈ సీజన్ ప్రస్తుతం ఓటీటీలో ఊపేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. రెండో సీజన్‌లో మరో జంట కథపై కథ సాగుతుంది. ‘ఆఫ్ క్యాంపస్’ సీజన్ 1 లోని అన్ని ఎపిసోడ్‌లు మే 13( ఈ రోజునుంచే) ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సిరీస్ లో రొమాంటిక్ సీన్స్ కూడా ఎక్కువే.. ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి.