స్టార్ దర్శకుడి ఉదారత.. పోలీసుల కోసం 11 హోటళ్లను ఇచ్చేశాడు

| Edited By:

Jul 12, 2020 | 2:22 PM

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలిందిస్తున్నారు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు కొంతమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు.

స్టార్ దర్శకుడి ఉదారత.. పోలీసుల కోసం 11 హోటళ్లను ఇచ్చేశాడు
Follow us on

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలిందిస్తున్నారు వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు కొంతమంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైన సాయం చేస్తూ తమలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్‌ శెట్టి పోలీసుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ముంబయిలో తనకు చెందిన 11 హోటళ్లను డ్యూటీలో ఉన్న పోలీసుల కోసం ఇచ్చేశారు రోహిత్‌.

ఈ విషయాన్ని వెల్లడించిన ముంబయి పోలీసులు, రోహిత్‌కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఖాకీలో ఉన్న వారికి సాయం చేస్తూ వస్తోన్న రోహిత్‌ శెట్టికి ధన్యవాదాలు అని ముంబయి కమిషనర్ ఆఫ్‌ పోలీస్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ ట్వీట్ చేశారు. డ్యూటీ చేస్తున్న పోలీసులు ఈ హోటళ్లలో రెస్ట్ తీసుకోనున్నారు. అంతేకాదు ఆ పోలీసులకు అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు ఆ హోటళ్లలోనే అందివ్వనున్నారు. కాగా రోహిత్ చేస్తున్న సాయంపై నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.