
Rao Ramesh First Look: ఆర్ఎక్స్100 సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఒక్క సినిమాతోనే మంచి ఫేమ్‌ను సంపాదించుకున్నారు. ఇక మొదటి సినిమా తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అజయ్ భూపతి రెండో చిత్రంకు చాలా గ్యాప్ తీసుకున్నారు. అజయ్ తన రెండో చిత్రంగా మహా సముద్రంను తెరకెక్కించే పనిలో పడ్డారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలక్షణ నటుడు రావు రమేశ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మంగళవారం రావు రమేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో రావు రమేశ్ గూని బాబ్జీగా కనిపించనున్నారు. ఇక ఫస్ట్‌లుక్‌ను గమనిస్తే రావు రమేశ్ పాత్ర విలక్షణతో కూడినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో రావు రమేశ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పాత్ర విడుదల చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తోన్న అజయ్ భూపతి మహాసముద్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Acharya: ‘డబుల్ కా మీఠా… ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సీన్స్ గ్యారంటీ.. కొరటాల శిబిరం హామి
Tollywood: తెలుగునాట ట్రెండింగ్‌గా మారిన రణబీర్, ఆలియా.. ఎందుకో తెలుసుకుందాం పదండి