Waltair Veerayya: బాస్ వస్తుండు గెట్ రెడీ బాయ్స్.. అదిరిపోయిన వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ ప్రోమో

|

Nov 23, 2022 | 6:17 PM

మెగాస్టార్ నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ తో పటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Waltair Veerayya: బాస్ వస్తుండు గెట్ రెడీ బాయ్స్.. అదిరిపోయిన వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ ప్రోమో
Waltair Veerayya
Follow us on

మెగాస్టార్ మోస్ట్ అవేటెడ్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమానుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమానుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించనున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమానుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది. నవంబర్ 23న సాయంత్రం 4గంటల ఐదు నిమిషాలకు ఈ సినిమా నుంచి బాస్ పార్టీ లిరికల్ సాంగ్‌ రిలీజ్ అవుతోంది.

ఇక ఇదే విషయాన్ని తాజాగా తమ సోషల్ మీడియా హ్యాండిలింగ్‌లలో అనౌన్స్ చేశారు ఈ మూవీ మేకర్స్. ఇక తాజాగా ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మరోసారి దేవీ శ్రీ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడని ఈ ప్రోమో చూస్తే అర్ధమవుతుంది.

ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా రిలీజ్ అయిన బాస్ పార్టీ ప్రోమో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..