
ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి(69) (Bappi Lahiri) కన్నుమూశారు. బుధవారం ఉదయం అనారోగ్య సమస్యలతో బప్పీ లహిరి మృతిచెందారు. బప్పి డాగా ప్రసిద్ధి చెందిన అలోకేష్ లాహిరి వయసు కేవలం 69 ఏళ్లు. అతను భారతీయ చలనచిత్రంలో సింథసైజ్డ్ డిస్కో సంగీతాన్ని ఉపయోగించడాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాడు. బప్పీలహరికి బంగారం అంటే మహా ఇష్టం
ఎక్కువగా బంగారు కడియాలు ధరించి కన్పించే బప్పీ మెడలో పెద్ద బంగారు గొలుసు, చేతికి పెద్ద పెద్ద ఉంగరాలు ఎప్పుడూ ధరించేవారు. బప్పీ లహిరి మృతి పై ప్రధాని నరేంద్రమోడి, మెగాస్టార్ చిరంజీవితోపాటు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
బప్పీ లహిరి తన సంగీతంతో వైవిధ్యమైన భావోద్వేగాలను అందంగా వ్యక్తీకరించారు. అతని పాటలతో తరతరాలుగా ప్రజలను అలరించారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు్న్నాను అంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. బప్పి లహరితో నాకు మంచి అనుబంధం ఉంది. అతను నా కోసం అనేక చార్ట్‌బస్టర్ సాంగ్ లను అందించారు. అతను అందించిన సాంగ్స్ నా సినిమాల సక్సెస్ కి ఎంతగానో ఉపయోగపడ్డాయి. అతని సంగీతంలో ప్రతిబింబించే అతని ప్రత్యేకమైన శైలి, జీవితం పట్ల అతని ఉత్సాహం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులు మరియు ప్రియమైన వారందరికీ నా హృదయపూర్వక సానుభూతి అంటూ ట్విట్ చేశారు.
మోహన్ బాబు ట్వీట్..
Also Read: Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ప్రతీకారం తీర్చుకోకుండా అస్సలు వదిలిపెట్టరు.. ఎవరో తెలుసా..
Sandhya Mukherjee: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ప్రముుఖ సింగర్ మృతి..
Bappi Lahiri: బ్రేకింగ్.. సింగర్ బప్పి లహిరి కన్నుమూత .. !!