Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసిన నటించిన సినిమా ఆచార్య. ఏప్రిల్ 29న విడుదలైన

Megastar Chiranjeevi: మరోసారి టైటిల్ లీక్ చేసిన చిరు ?.. బాబీతో సినిమా అదేనంటూ..
Chiranjeevi

Updated on: Apr 30, 2022 | 3:47 PM

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసిన నటించిన సినిమా ఆచార్య. ఏప్రిల్ 29న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో పూజా హెగ్డే, సోనూసూద్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాను.. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమానే కాకుండా.. చిరు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమా షూటింగ్స్‏లతో చిరు బిజీగా ఉన్నారు. ఇవే కాకుండా.. డైరెక్టర్ బాబీతోనూ మరో మూవీ చేయనున్నాడు చిరు. గత కొద్ది రోజులుగా బాబీతో చిరు చేయబోయే సినిమా గురించి పలు రకాల అప్డేట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ గురించి ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న చిరు.. బాబీతో తాను చేయబోయే సినిమా టైటిల్ లీక్ చేశారు.

చిరు మాట్లాడుతూ.. ” బాబీ సినిమా టైటిల్ నేను చెప్పను.. ఎందుకంటే మళ్లీ టైటిల్ లీక్ చేశానంటారు.. ఆచార్య సినిమా కూడా నేనే చెప్పాను.. వాల్తేర్ వీరయ్య.. ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు కథ బాగుందనుకున్నాం.. చాలా సంతోషంగా ఉందున్నాడు బాబీ. సినిమా స్టోరీ బాగుంది.. ఆ తర్వాత లేయర్స్ ఉంటాయి.. గ్రే షెడ్స్ .. లాజిక్స్ అస్సలు మిస్సవకూడదు.. ఇంకా రెండు నెలలు పెట్టుకుని స్ట్రిప్ట్ రెడీ చెయ్ అని చెప్పాను..తాను చెప్పిన పనిని అందంగా చేస్తాడు.. ఎంత చేస్తే అంత బాగా వస్తుంది.. సినిమా బాగుంటే ముగింపు ఉండదు.. యంగ్ డైరెక్టర్లతో కలిసి పనిచేయడం మరింత ఉత్సాహాన్నిస్తుంది.. ” అని చెప్పుకొచ్చాడు . అయితే మరోసారి చిరు తన సినిమా టైటిల్ లీక్ చేశాడు.. వాల్తేరు వీరయ్య అని చెప్పకనే చెప్పాడా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన గా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: AnushkaShetty : అప్పుడు కత్తిపట్టిన అనుష్క ఇప్పుడు గరిట తిప్పుతోంది.. ఎందుకో తెలుసా..

Nandita Swetha: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన అందాల నందిత శ్వేత

Kangana Ranaut : ‘థాకడ్’ మూవీతో నేనేంటో చూపిస్తానంటున్న ఫైర్‌బ్రాండ్‌ కంగనా

Acharya Movie: మెగాస్టార్‌ సినిమాలో నటించి మెప్పించిన ఈ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ ఎవరో తెలుసా?

Loading...
Unable to load recommendations.
Follow Us