మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు. వరుస ప్రాజెక్ట్‌లకు గ్రీన్ ఇస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఒక సినిమా పట్టాలపై ఉండగానే.. మరో చిత్రానికి ఓకే చెప్పేస్తున్నారు చిరు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు మెగాస్టార్. ఇప్పటికే మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేశాడు చిరు. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలో నటించగా.. కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవలే భోళా శంకర్ సినిమాను ప్రారంభించాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక్క డిసెంబర్ నెలలోనే చిరు నటిస్తోన్న నాలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో చిరు ఓ సినిమా చేయబోతున్నారట. ఇటీవలే నితిన్ ప్రధాన పాత్రలో నటించిన భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు వెంకీ కుడుముల. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మించనున్నారని టాక్. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందనున్న ఈ సినిమాలో కీలక పాత్రలో వరుణ్ తేజ్ నటించనున్నాడని.. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ప్రకటించనున్నారు.