koratala siva: కొరటాల శివకు షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అదే నా విజయం అంటూ రిప్లై.. ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

koratala siva: కొరటాల శివకు షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. అదే నా విజయం అంటూ రిప్లై.. ..

Updated on: May 28, 2021 | 1:52 PM

koratala siva: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఈ సినిమాకోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. మిర్చి సినిమాతో దర్శకుడిగా మొదలు పెట్టిన ఆయన ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది. కొరటాల శివ చేసిన సినిమాలన్నీ స్టార్ హీరోలతోనే అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రభాస్ , మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు కొరటాల. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం పై స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు చేశారు కొరటాల. ఇటీవల ఓ సందర్భంలో కొరటాల మాట్లాడుతూ..  అందరిలాగే చిన్నప్పటి నుండి మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చారు. అలాంటిది మెగాస్టార్ తోనే సినిమా అనేసరికి ఆ  ఆనందం మాటల్లో చెప్పలేనిదని అంటున్నాడు.

చిరంజీవి షూటింగ్ ఫస్ట్ డే తన క్యారవాన్ నుండి దిగి బయటికి రాగానే కొరటాల వెళ్లి తన ఉత్సాహం అంతా బయట పెట్టాడట. అసలు మెగాస్టార్ కు నేను ‘యాక్షన్’ అని చెప్పడమే గొప్ప విజయంగా భావిస్తున్నట్లు  చెప్పుకొచ్చాడు కొరటాల. దీని పై మెగాస్టార్  చాల సరదాగా స్పందించారు.. “నిజానికి నా సినిమాలు చూస్తూ పెరిగిన కొరటాల శివ దర్శకుడు అయ్యాక కూడా నేను హీరోగా సినిమాలు చేస్తున్నానంటే ఇది నా విజయంగా అనిపిస్తుంది” అంటూ సమాధానం ఇచ్చారు మెగాస్టార్. చిరు రిప్లై కి కొరటాల షాక్ అయ్యారట. ఇలాంటి సరదా విషయాన్నీ కూడా ఆయన చాల సింపుల్ గా తన విజయంగా చెప్పడం నిజంగా గొప్పవిషయం అంటూ కొరటాల తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna Rama Dandakam : బాలయ్య కంఠం నుంచి ఉప్పొంగిన శ్రీరామ దండకం.. తండ్రి జన్మదినవేళ ఘనంగా గాత్ర నివాళి.. ఎలా ఉందో మీరూ చూడండి..!

Balaiah on Anandayya : ఆనందయ్య కరోనా మందుపై టాలీవుడ్ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us