Manchu Vishnu: కరోనా మహమ్మారి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. లాక్ డౌన్ కారణంగా సినిమా పరిశ్రమ స్తంభించింది. షూటింగ్ లు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దాంతో సినిమా తారలంతా ఇంట్లో కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. మంచు విష్ణు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా పిల్లలతో సమయం గడుపుతున్నాడు. అయితే విష్ణుకు తన కూతురు అరియనా ఓ ఛాలెంజ్ విసిరింది. అదేంటంటే మంచు విష్ణు గడ్డం తీసేస్తే నెలరోజులపాటు మాటవింటానని. అందుకు మోహన్ బాబును సాక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. నాన్న గడ్డం తీసేస్తే నేను నెల రోజుల పాటు నేను చెప్పిన మాట వింటానంటూ మోహన్ బాబు ముందు మంచు విష్ణు కూతురు అంటుంది. అప్పుడు విష్ణు తను ఎప్పుడు కూడా నా మాట వినదు. ఈసారి ఛాన్స్ దక్కింది కదా అంటూ గడ్డం తీసేశాడు. దాదాపు 15 నెలలుగా పెంచిన గడ్డాన్ని కూతురు కోసం తీసేసాడు విష్ణు గడ్డంను తీయడంతో మొదట చిన్న పాప విష్ణు ను గుర్తించలేదు. ఆ తర్వాత దగ్గరకు వచ్చింది. ఇక బాబు కూడా సిగ్గు పడుతూ నవ్వుతూ తండ్రి వద్దకు వచ్చాడు. ఆతర్వాత మోహన్ బాబు కూడా షాక్ అయ్యాడు. చివరకు పెద్ద పాపా అరియనా తండ్రిమాట వినాల్సి వచ్చింది. ఇప్పుడు ఈవీడియో వైరల్ గా మారింది.
మరిన్ని ఇక్కడ చదవండి :