Manchu vishnu: ‘మా’ బిల్డింగ్ గురించి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు.. టికెట్​ రేట్స్​పై కూడా కీలక కామెంట్స్

|

May 15, 2022 | 2:42 PM

మరో ఆరు నెలల్లో 'మా' శాశ్వత భవనానికి భూమి పూజా చేయనున్నట్లు చెప్పారు ప్రెసిడెంట్ మంచు విష్ణు. సినిమా టికెట్‌ ధరల విషయంలో తానెందుకు మాట్లాడలేదో వివరించారు.

Manchu vishnu: మా బిల్డింగ్ గురించి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు.. టికెట్​ రేట్స్​పై కూడా కీలక కామెంట్స్
Manchu Vishnu
Follow us on

‘మా’ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు అసోసియేషన్‌కు శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్ మంచు విష్ణు. మరో ఆరు నెలల్లో ‘మా’ శాశ్వత భవనానికి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. ‘మా‌’ సభ్యుల వెల్పేర్, హెల్త్ తన ప్రధాన కర్తవ్యమని చెప్పారు. ‘మా’ సభ్యుల కోసం ఆదివారం హైదరాబాద్‌(Hyderabad)లోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)లో వైద్య శిబిరాన్ని నిర్వహించిన నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు.  ఇక సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు మంచిదా కాదా… ఏ సినిమాకు ఎంతమాత్రం మేలు చేస్తుంది… చిన్న సినిమాల పరిస్థితేంటి… ఈ టాపిక్‌ సీరియస్‌గా మొదలైంది ఇండస్ట్రీలో. చిన్నా పెద్దా నిర్మాతలు, దర్శకులు, హీరోల కాంపౌండ్స్‌ కూడా ఇదే అంశం మీద గట్టిగా ఆలోచిస్తున్నాయి. సినిమా టిక్కెట్ల పెంపు విషయంలో తాను గతంలో మాట్లాడకపోవడాన్ని మళ్లీ సమర్థించుకున్నారు ‘మా’ ఛైర్మన్ విష్ణు. టిక్కెట్ల పెంపు కరెక్టా కాదా అనే అంశంపై చర్చ జరగాల్సిందే అన్నది ఆయన మాట.  దీని గురించి, తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ అందరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందన్నారు.

సినిమా టికెట్ల ధరల పెంపుతో లాభపడదామనుకున్న కొన్ని సినిమాలు ఫలితం దగ్గర అడ్డం తిరిగాయి. రీసెంట్‌గా విడుదలైన అగ్ర హీరోల సినిమాల మీద టిక్కెట్ల పెంపుతో నెగిటివ్ ఎఫెక్ట్ పడిందన్నది ఒక వెర్షన్. ఓపెనింగ్స్‌ లేకపోవడంతో బడా సినిమా నిర్మాతలు డీలా పడ్డట్టు తెలుస్తోంది. అందుకే.. టిక్కెట్ల రేట్లపై పునరాలోచన అవసరం అంటున్నారు సీనియర్లు. లేటెస్ట్‌గా సీనియర్ నిర్మాత దిల్‌రాజు కూడా టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో బీ కేర్‌ఫుల్ అంటున్నారు. ఈనెల 27న రిలీజయ్యే ఎఫ్‌3 మూవీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు నిర్మాత దిల్‌రాజు. టికెట్‌ ధర పెంచకుండానే ఎఫ్‌3ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.