
మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కినా అక్కడి సినిమాలు భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ముఖ్యంగా కాన్సెప్ట్ బేస్డ్‌గా తెరకెక్కుతున్న మలయాళ చిత్రాలు సులభంగా వందకోట్ల క్లబ్‌లో చేరిపోతున్నాయి. పైగా ఈ సినిమల్లో స్టార్ క్యాస్టింగ్ ఉండదు. వీఎఫ్ ఎక్స్ హంగులు, భారీ యాక్షన్ సీక్వెన్సులు ఉండవు. స్పెషల్ సాంగ్స్ గట్రా కూడా ఉండవు. కానీ కంటెంట్ తోనే ఈ సినిమాలుప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. అలా మలయాళంలో రెండేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన చిన్న సినిమాల్లో ‘వాళా’ ఒకటి. ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్’ అనేది ఈ మూవీ క్యాప్షన్. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.40 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. వాళా అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. అలాగే పనీపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అర్థం వస్తుంది. 2024లో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘వాళా 2’ వచ్చింది. ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’ అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఏప్రిల్ 2న రిలీజైన ఈ సినిమా 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 163.50 కోట్లు వసూలు చేసింది. తద్వారా 2024లో వచ్చిన పృథ్వీ రాజ్ సుకుమారన్ ది గోట్ లైఫ్ రూ. 158.50 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లను అధిగమించింది.
సవిన్ తెరకెక్కించిన వాళా 2 సినిమాలో హషీర్, అలన్, వినాయక్, అజిన్, బిజు కుట్టన్, అల్ఫోన్స్ పుత్రేన్, విజయ్ బాబు, అజు వర్గీస్, అమీన్, ఏంజెల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. స్కూల్ లైఫ్, ఫ్రెండ్ షిప్ కాన్సెప్టుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అక్కడి యూత్‌కు తెగ నచ్చేసింది. కాగా ఈ సినిమా నిర్మాతల్లో సాహు గారపాటి కూడా ఒకరు. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా సాహు గారపాటి నిర్మించినదే. ఇప్పుడు ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉన్న ‘వాజా 2’ కూడా వంద కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మలయాళం బ్లాక్ బస్టర్ ను త్వరలోనే తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయని, అతి త్వరలోనే వాళా 2 సినిమాను తెలుగులోకి రిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
#Vaazha2 11 Days Worldwide Box Office Collection Is Close To ₹164Cr
Second Sunday Worldwide Gross – ₹15 Cr+
All Time #6 Mollywood Grosser Worldwide Behind #Lokah, #Thudarum and #2018Movie.
Will Cross #2018Movie WW Final in 2 Days And Marching Towards ₹200 Cr Club 🔥 pic.twitter.com/EcEsLPeF63
— Classic Cinema (@ClassicCin86483) April 13, 2026