Major Movie: సినిమా టికెట్ కోసం క్యూలో నిల్చున్న మహేష్ బాబు.. వైరలవుతున్న వీడియో..

|

May 30, 2022 | 9:05 AM

అడివి శేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం మేజర్. 26/11 దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని

Major Movie: సినిమా టికెట్ కోసం క్యూలో నిల్చున్న మహేష్ బాబు.. వైరలవుతున్న వీడియో..
Mahesh Babu
Follow us on

ప్రస్తుతం సినిమా ప్రమోషన్ చేసుకోవడానికి మేకర్స సరికొత్తగా ప్రయత్నిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో తమ మూవీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఒక్కో చిత్రయూనిట్ కొత్తగా ట్రై చేస్తుంటారు. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట, ఎఫ్ 3 సినిమాలకు నటీనటులే కాకుండా.. డైరెక్టర్స్, మేకర్స్ సైతం ప్రమోషన్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా ప్రమోషన్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఏకంగా సినిమా టికెట్ క్యూలో నిల్చున్నారు. కానీ నిజంగానే జనాలు ఉండే థియేటర్లో కాదండి.. ప్రమోషన్ కోసం చేసి వీడియోలో మహేష్ టికెట్ కోసం క్యూలో నిల్చున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసుకుందామా..

అడివి శేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం మేజర్. 26/11 దాడులలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ , ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్ సంస్థలతో కలిసి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగుతోపాటు.. మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ షూరు చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా ప్రచారంలో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ థియేటర్ ముందు క్యూలో నిల్చున్నారు. యూట్యూబర్, డిజిటల్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం తో కలిసి తమ సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేశారు. అందులో నిహారిక సినిమా టికెట్ కోసం క్యూలో నిలబడగా.. ఆమె ముందు ఒకరి తర్వాత మరోకరు వస్తూనే ఉంటారు.. మధ్యలో హీరో అడివి శేష్ రావడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఈ లోపు మహేష్ బాబు వచ్చి నిహారిక ముందు నిల్చుంటాడు. ఆయనను చూడగానే నిహారిక సర్ ప్రైజ్ అవుతుంది. మా స్నేహితులను కూడా పిలవొచ్చా అని మహేష్ అడగ్గానే ఒకే అంటుంది. దీంతో లైన్ మరింత పెరుగుతుంది. ఫోన్ నంబర్ అడిగేలోపు మహేష్ వెళ్లిపోవడంతో నిహారిక అసహనం వ్యక్తం చేయగా.. ఆ తర్వాత శేష్ నుంచి నంబర్ తీసుకుంటుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ట్వీట్..