Mahesh Babu: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ

|

Jul 16, 2024 | 8:25 AM

రాజమౌళి సినిమా లాంఛింగ్‌, షూటింగ్ వివరాలు, యాక్ట‌ర్స్‌, టెక్నీషియన్స్.. ఇలా పలు విష‌యాల‌పై మ‌హేశ్ బాబు బ‌ర్త్‌డే రోజున ఫుల్ క్లారిటీ రానున్న‌ట్లు టాక్. దీంతో పాటు మహేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతను నటించిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది.

Mahesh Babu: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ
Mahesh Babu
Follow us on

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న అభిమానులకు చాలా సర్ ప్రైజ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆరోజే మహేశ్, రాజమౌళిల సినిమాకు సంబధించి ఒక అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. సినిమా లాంఛింగ్‌, షూటింగ్ వివరాలు, యాక్ట‌ర్స్‌, టెక్నీషియన్స్.. ఇలా పలు విష‌యాల‌పై మ‌హేశ్ బాబు బ‌ర్త్‌డే రోజున ఫుల్ క్లారిటీ రానున్న‌ట్లు టాక్. దీంతో పాటు మహేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని అతను నటించిన ఒక బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో రీ రిలీజ్ కాబోతుంది. అదే మురారి. సుమారు 23 ఏళ్ల త‌ర్వాత ఈ మూవీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. సుమారు 300కు పైగా థియేటర్లలో ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. కృష్ణ‌వంశీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మ‌హేష్‌ బాబుకు జోడీగా సోనాలీ బింద్రే హీరోయిన్‌గా న‌టించింది. ఆమెకుఇదే మొదటి తెలుగు సినిమా కావడం విశేషం. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన మురారి సినిమాకు ఏకంగా మూడు నంది అవార్డులు వచ్చాయి. బెస్ట్ ఫిల్మ్‌గా సిల్వ‌ర్ అవార్డుతో పాటు బెస్ట్ క్యారెక్ట‌ర్ యాక్ట‌ర్‌గా ల‌క్ష్మి నంది పుర‌స్కారాన్ని గెలుచుకున్నారు. అలాగే స్పెష‌ల్ జ్యూరీ కేట‌గిరీలో మ‌హేష్‌బాబు కూడా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా గుంటూరు కారం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మహేశ్ బాబు ఇప్పుడు తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్నాడు. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ కొన్నిరోజులుగా స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీంతో మహేష్ లుక్ పూర్తిగా మారిపోయింది. లాంగ్ హెయిర్‏తో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇటీవల అనంత్ అంబానీ – రాధికా మ‌ర్చెంట్ పెళ్లి వేడుక‌ల్లో కూడా ఎంతో స్టైలిష్ గా మ‌హేష్ క‌నిపించాడు. రాజ‌మౌళి మూవీలో ఇదే లుక్‌లో మ‌హేష్ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. హాలీవుడ్ అడ్వెంచెరస్ థ్రిల్లర్ మూవీ ఇండియానా జోన్స్ త‌ర‌హాలోనే మహేశ్- రాజమౌళి సినిమా కూడా ఉండ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. అలాగే ఇందులో మ‌హేష్‌బాబు డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..