
నేడు.. మహేష్ బాబు అభిమానులకు పండుగరోజు. ప్రతి అభిమాని సంబరాలు జరుపుకునే రోజు.. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. (ఆగస్టు 9) టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. గత వారం రోజుల నుంచే మహేష్ ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నారు. టాలీవుడ్‌లో ప్రిన్స్‌గా, సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు మహేష్ . సినిమా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేశాడు. 1979లో వచ్చిన ‘నీడ’ సినిమాలో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. 1999లో విడుదలైన ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేశాడు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న మహేష్ ఆతర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు.
రాజకుమారుడు తర్వాత మహేష్ బాబు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఒక్కడు లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇలా వరుస హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ టాప్ హీరో అయ్యాడు. మహేష్ సినిమాలు రిలీజ్ టైం లోనే కాదు రీ రిలీజ్ ల్లోనూ థియేటర్ల దుమ్ముదులుపుతున్నాయి. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లోనూ మహేష్ బాబు సూపర్ స్టారే..
తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్న మహేష్ .. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు, గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయిస్తూ ఎంతో మంది గుండెల్లో దేవుడిగా నిలిచారు. మహేష్ బాబు కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా భారీగా సంపాదిస్తున్న మహేష్ బాబు.. తన సంపాదంలో లో 30 శాతం వివిధ సేవలకు ఖర్చు చేస్తారు.మహేష్ బాబు ఏపీ లోని స్వగ్రామమైన బుర్రిపాలెం సహా తెలంగాణ లోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. ఇక నేడు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలు, ఆయన అభిమానులు, యావత్ ప్రపంచమంతా ఉన్న తెలుగు సినిమా ఆడియన్స్ ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. కాగా మహేష్ బాబు నటిస్తున్న తాజాగా చిత్రం వారణాసి, ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు పుట్టిన రోజుకు విషెస్ తెలుపుతూ సినిమా నుంచి మహేష్ లుక్స్ ను విడుదల చేశారు. ఆ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.
Another trip around the Sun… before we travel across time.
Happy Birthday Rudhra 💙 @urstrulymahesh #Varanasi pic.twitter.com/Iqa3QLtHiR
— Varanasi (@VaranasiMovie) August 9, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.