
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu )నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్నాయి. మొదటిగా వచ్చిన కళావతి పాట యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఆతర్వాత వచ్చిన పెన్నీ.. రీసెంట్ గా వచ్చిన టైటిల్ సాంగ్ ట్రేండింగ్ లో కంటిన్యూ అవుతున్నాయి.
తాజాగా ఈ మూవీలోని కళావతి సాంగ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ సాంగ్ 150 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించి రికార్డుకెక్కింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. మే 12న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :