Sarkaru Vaari Paata: క్రేజీ అప్‏డేట్.. ఫేమస్ మ్యూజిక్ సంస్థకు ‘సర్కారు వారి పాట’ ఆడియో రైట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: క్రేజీ అప్‏డేట్.. ఫేమస్ మ్యూజిక్ సంస్థకు సర్కారు వారి పాట ఆడియో రైట్స్..
Sarkaru Vaari Paata

Updated on: Jul 30, 2021 | 8:27 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తోన్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ అభిమానులకు వరుస అప్‏డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. నిన్న సర్కారు వారి పాట నుంచి ఫస్ట్‏లుక్ పోస్టర్ పోస్టర్ జూలై 31వ విడుదల చేయనున్నట్లుగా ప్రకటించిన మేకర్స్… తాజాగా మరో అప్‏డేట్ ఇచ్చేశారు. సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన మ్యూజిక్ రైట్స్ ని పాపులర్ ఆడియో లేబుల్ కంపెనీ సరిగమ సౌత్ వారు తీసుకున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫార్మ్ ని పరిగణలోకి తీసుకుని ఆడియో రైట్స్ మంచి ధర పలికినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్.. థమన్ కాంబోలో వచ్చిన దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు సినిమాలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. దీంతో మరోసారి వీరిద్ధరి కలయికలో రాబోతున్న సర్కారు వారి పాట సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ – జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుబాయ్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇటీవల హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ షుటింగ్ జరుపుకుంటోంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఆగస్ట్ 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ట్వీట్..

Also Read:

టాలీవుడ్‏లో పాగా వేసేందుకు సిద్ధమైన హీరోయిన్ ఈ ఫోటోలో ఉంది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

Narappa Success Meet: విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్న’నారప్ప’ టీం.. సక్సెస్ మీట్ లైవ్..

Brahmaji: సేవ్ సినిమా.. సేవ్ థియేటర్స్.. రైటర్స్‏కు విజ్ఞప్తి చేసిన బ్రహ్మజీ.. కారణమేంటంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us