Guntur Kaaram: గుంటూరు దద్దరిల్లిపోవాలి.. నేడు గుంటూరుకారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

| Edited By: Ravi Kiran

Jan 09, 2024 | 4:05 PM

సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌కి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. . ముందు ట్రైలర్ లాంచ్‌కు గ్రాండ్ ఈవెంట్‌ ప్లాన్ చేసినా.. పర్మిషన్స్ రాకపోవటంతో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది యూనిట్‌. ఎలా రిలీజ్‌ అయితే ఏంటి? మాకు కావాల్సింది సూపర్‌స్టార్‌ మాస్‌ వైబ్‌ అంటూ సెలబ్రేట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇవాళ గుంటూరులో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఓ రేంజ్‌లో జరగబోతోంది.

Guntur Kaaram: గుంటూరు దద్దరిల్లిపోవాలి.. నేడు గుంటూరుకారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
Gunturu Kaaram
Follow us on

సూపర్‌ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ట్రైలర్‌కి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. . ముందు ట్రైలర్ లాంచ్‌కు గ్రాండ్ ఈవెంట్‌ ప్లాన్ చేసినా.. పర్మిషన్స్ రాకపోవటంతో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది యూనిట్‌. ఎలా రిలీజ్‌ అయితే ఏంటి? మాకు కావాల్సింది సూపర్‌స్టార్‌ మాస్‌ వైబ్‌ అంటూ సెలబ్రేట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఇవాళ గుంటూరులో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఓ రేంజ్‌లో జరగబోతోంది.

సినిమా రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలు పెట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అవుతున్న గుంటూరు కారం మీద భారీ అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలకు తగట్టుగా భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో మహేష్‌కు మంచి మార్కెట్‌ ఉండటంతో ఆ స్థాయిలోనే రిలీజ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఒక్కో అప్‌డేట్‌తో గుంటూరు కారం సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది చిత్రయూనిట్‌. ముఖ్యంగా చాలా కాలం తరువాత మహేష్ అవుట్ అండ్ అవుట్‌ మాస్ క్యారెక్టర్ ప్లే చేస్తుండటం ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తోంది. వీటన్నింటినీ మించి… నిర్మాత నాగవంశీ ఇచ్చిన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌లో ఎగ్జైట్మెంట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాయి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకు జోడిగా శ్రీలీల నటిస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జైరామ్ , జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాతప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు ఫ్యాన్స్.

గుంటూరు కారం మూవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి