Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ వచ్చేసింది.. ఇరగదీసిన మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సక్కారు వారి పాట. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చేసింది.. ఇరగదీసిన మహేష్ బాబు
Mahesh Babu

Updated on: May 03, 2022 | 7:33 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, వీడియోస్ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇందులో మహేష్ మరింత స్టైలీష్ లుక్‏లో కనిపించనుండడంతో సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు మహేష్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కళావతి, పెన్నీ సాంగ్స్ రెండూ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. మిలియన్స్ వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.

ఈ క్రమంలో మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మహేష్ మాస్ యాక్షన్ సీన్స్ తో పాటు లవ్ ట్రాక్ కూడా చూపించారు ఈ ట్రైలర్ లో.. ఇక మహేష్ చెప్పిన డైలాగ్స్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది.హైవోల్టేజ్ యాక్షన్.. గ్రాండ్ విజువ‌ల్స్‌…. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే డైలాగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది సర్కారు వారి పాట ట్రైలర్. మొత్తంగా మహేష్ ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో ఈ సినిమా అలా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు షాక్ ఇచ్చిన లీకర్స్.. సోషల్ మీడియాలో మూవీ ఫైట్ సీన్..

Satyajit Ray: భారతీయ సినిమాలో కొత్త ఒరవడి సృష్టించిన ప్రజ్ఞాశాలి సత్యజిత్‌రాయ్‌

Viral Photo: బూరె బుగ్గల చబ్బీ గర్ల్ ఎవరో గుర్తుపట్టండి.. టాలీవుడ్‏లోనే క్రేజీ హీరోయిన్..

Telugu Movies: ఈవారం మరింత ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో.. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us