Monalisa: ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..

మహా కుంభమేళా బ్యూటీ మోనాలిసా భోంస్లే వివాహంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మోనాలిసాతో సినిమా తీస్తోన్న డైరెక్టర్ సరోజ్ మిశ్రా అయితే ఏకంగా ఈ వివాహాన్ని లవ్ జిహాద్ అని సంచలన కామెంట్స్ చేశాడు. అందుకు తగ్గట్టుగానే ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.

Monalisa: ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్న మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా? ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Monalisa Bhosle

Updated on: Mar 13, 2026 | 6:55 AM

 

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సందర్భంగా రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోంస్లే , తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలో వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ సమీపంలోని అరుమనూర్‌లోని నాయనార్ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ వివాహం తర్వాత మోనాలిసా భోంస్లే ఇస్లాం మతంలోకి మారుతుందా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. దీనికి మోనాలిసా- ఫర్మాన్ ఖాన్ సమాధానం ఇచ్చారు. వివాహం తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో మోనాలిసా మాట్లాడుతూ, “మేము హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాము. నేను ఇస్లాం మతంలోకి మారలేదు. కాబట్టి ఇది లవ్ జిహాద్ కాదు” అని స్పష్టం చేసింది. నుదిటిపై సింధూరం ధరించి, ఫార్మాన్ ఇంతకు ముందు ఈ వివాహానికి అంగీకరించలేదు. నేను అతనిని ఒప్పించి ఈ వివాహం చేసుకున్నాను’ అని చెప్పింది. ఇదే సందర్భంగా ఫర్మాన్ ఖాన్ మాట్లాడుతూ, ‘మేమిద్దరం కళాకారులం. మేము అన్ని మతాలను గౌరవిస్తాము. ప్రేమలో మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. తద్వారా తన భార్య మోనాలిసా భోంస్లే ఇస్లాం మతంలోకి మారదని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

షూటింగ్ కోసం కేరళలో ఉన్నప్పుడు మోనాలిసా రక్షణ కోరుతూ తిరువనంతపురం పోలీసులను ఆశ్రయించింది. తన తండ్రి తనను బలవంతంగా తన స్వగ్రామానికి తీసుకెళ్లి ఒక బంధువుతో వివాహం చేయడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. “నా కజిన్‌ను నేను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు, అందుకే నేను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నాను” అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరోవైపు మోనాలిసా మైనరా? మేజరా? అన్న విషయంపై తీవ్ర గందరగోళం నెలకొంది. దీనికి తెరదించుతూ ఆమె తన బర్త్ సర్టిఫికెట్ ను విలేకరుల సమావేశం సాక్షిగా అందరికీ చూపించింది.తనకు 18 ఏళ్లు నిండాయని క్లారిటీ ఇచ్చింది.
‘మోనాలిసా మేజర్ కాబట్టి, ఆమె ఇష్టానుసారం జీవించే హక్కు ఆమెకు ఉంది’ అని పోలీసు అధికారులు తెలిపారు.

మోనాలిసా పెళ్లి వీడియోలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us