పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకున్నాడు.. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు

తెలుగు జానపద కళారంగంలో ‘బాసింగ బలాలు’ వంటి వరుస హిట్‌ పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ ఫోక్‌ డ్యాన్సర్‌, నటుడు ఈశ్వర్‌ సాయి ఇటీవల తీవ్ర వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక భవనంలో తోటి ఫోక్‌ ఆర్టిస్ట్‌ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకున్నాడు.. ఈశ్వర్ సాయిపై మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు
Eshwar Sai Madhuri Rathod

Updated on: Sep 01, 2026 | 11:57 AM

ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వ్యవహారంలో ఊహించని మలుపు, పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాధురి రాథోడ్ ఫిర్యాదు తర్వాత ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది.
పెళ్లి పేరుతో తనను మోసం చేశాడంటూ.. ఆగస్టు 22న నార్సింగి పోలీసు స్టేషన్ లో మాధురి రాథోడ్ ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. మాధురి రాథోడ్ కేసు నమోదు కావడంతో ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈశ్వర్ సాయి కోసం రెండు పోలీస్ బృందాలు గాలిస్తున్నారు.

కాగా ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ రాసలీలలను ఈశ్వర్ సాయి భార్య శరణ్య బయటపెట్టడం పెద్ద చర్చకు దారితీసింది. ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ కలిసి పలు ఫోక్ సాంగ్స్ లో డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఈశ్వర్ సాయికి పెళ్ళై ఒక బాబు కూడా ఉన్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఒక భవనంలో తోటి ఫోక్‌ ఆర్టిస్ట్‌ మాధురి రాథోడ్‌తో కలిసి ఒకే గదిలో ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య వారిని రెడ్ హ్యడెండ్ గా పట్టుకున్నారు.

అక్కడే వారి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరగడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో చాలా మంది ఈ ఇద్దరి గురించి రకరకాల వీడియోలు చేస్తున్నారు. ఎవరెవరో ఈ ఇద్దరి గురించి రకరకాల కామెంట్స్, ఇంటర్వ్యూలు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈశ్వర్ సాయి పై మాధురి రాథోడ్ కేసు పెట్టడం సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us