Love You Ram Trailer: ‘ప్రేమించడం ఈజీ.. నమ్మించడమే కష్టం’.. లవ్ యూ రామ్ ట్రైలర్..

తాజాగా యూత్, ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యింది లవ్ యూ రామ్ చిత్రం. సంతోషం, మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి సినిమాలను రూపొందించిన డైరెక్టర్ దశరథ్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డివై చౌదరి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో మొత్తం కొత్త నటీనటులు కనిపిస్తున్నారు. అయితే మంగళవారం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Love You Ram Trailer: ప్రేమించడం ఈజీ.. నమ్మించడమే కష్టం.. లవ్ యూ రామ్ ట్రైలర్..
Love You Ram Trailer

Updated on: Jun 20, 2023 | 4:54 PM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కంటెంట్ బాగుంటే చాలు జనాలు క్యూ కట్టేస్తున్నారు. చిన్నా, పెద్ద సినిమా అని కాకుండా.. కథ నచ్చితే విజయాన్ని అందిస్తున్నారు. కేవలం మాస్ యాక్షన్ సినిమాలే కాదు.. ప్రేమకథా చిత్రాలు సైతం హిట్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా యూత్, ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యింది లవ్ యూ రామ్ చిత్రం. సంతోషం, మిస్టర్ ఫర్ఫెక్ట్ వంటి సినిమాలను రూపొందించిన డైరెక్టర్ దశరథ్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. డివై చౌదరి దర్శకత్వం వహించిన ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమాలో మొత్తం కొత్త నటీనటులు కనిపిస్తున్నారు. అయితే మంగళవారం విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

అటు ఫారీన్, ఇటు ఇండియాలోనూ ఈ కథ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి విషయంలో అమ్మాయి అభిప్రాయం, అబ్బాయి సిద్ధాంతం రెండూ వేరు. ఎవరినైనా నమ్మించడమే జీవితమనేది అబ్బాయి పద్దతి.. జీవితాన్ని ప్రేమించడమే అమ్మాయి తీరు.. అలాంటి వేరు వేరు అభిప్రాయాలు ఉన్న ఇద్దరి మధ్య నడిచే కథనే లవ్ యూ రామ్. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ లోనూ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చివరగా నమ్మించడం కష్టం.. ప్రేమించడం ఈజీ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాను జూన్ 30న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి వేద సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పుడు విడుదలైన ట్రైలర్ లో వినిపించిన సాంగ్స్ బాగున్నాయి. మరి ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చూపిన సంగతి తెలిసిందే. మరీ ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us