AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: మంచి టాక్‌‌తో దుసుకుపోతున్న లవ్ స్టోరీ.. మ్యాజికల్ సక్సెస్ మీట్.. సంబరాల్లో చిత్రయూనిట్..

సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ.. నాగచైతన్య -సాయి పల్లవి జంటగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది.

Love Story: మంచి టాక్‌‌తో దుసుకుపోతున్న లవ్ స్టోరీ.. మ్యాజికల్ సక్సెస్ మీట్.. సంబరాల్లో చిత్రయూనిట్..
Love Story
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2021 | 6:36 PM

Share

Love Story: సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లవ్ స్టోరీ.. నాగచైతన్య -సాయి పల్లవి జంటగా వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. కరోనా తర్వాత వచ్చిన సినిమాల్లో లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమ కథతోపాటు చక్కటి మెసేజ్ తో తెరకెక్కిన ఈ సినిమా విజయంతో చిత్రబృందం నూతన ఉత్సాహంతో ఉన్నారు. లవ్ స్టోరీ సినిమా ఇచ్చిన సక్సెస్ తో చిత్రయూనిట్ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి నాగార్జునను .. దర్శకుడు సుకుమార్ ను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సినిమా విడుదలకు ముందే నెట్టింట్లో రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి, నాగచైతన్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కులవివక్షత.. అమ్మాయిల పట్ల ప్రస్తుతం జరుగుతున్న సంఘటన నేపథ్యంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తీరు అధ్బుతమనే చెప్పాలి. లవ్ స్టోరీ సినిమా కోసం ప్రేక్షకులు జై కొట్టారు. లవ్ స్టోరీ సినిమాతో థియేటర్లలో చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి నెలకొంది.

ఈ సినిమా విడుదలకు ముందే రూ. 30 కోట్లకుపైగా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసుకుంది. ఇక విడుదల తర్వాత సినిమాపై మంచి బజ్‌ రావడంతో రికార్డు దిశగా వసూళ్లు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా రూ. 50 కోట్ల మార్క్‌కు దాటే అవకాశం కనిపిస్తుంది.

లవ్ స్టోరీ సక్సెస్ మీట్ సంబరాలు ఇక్కడ చదవండి : 

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puri Jagannadh Birthday: గోవాలో పూరి జగన్నాథ్ బర్త్‌డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు..

Posani Krishna Murali : పవన్‌ కల్యాణ్‌ను కేసీఆర్‌ బహిరంగంగా హెచ్చరించారు.. అప్పుడు పవన్ ఫ్యాన్స్‌ ఏం చేశారు..?-పోసాని

Samantha: ‘సంవత్సర కాలంలో ఎన్నో జ్ఞాపకాలు’… వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ పోస్ట్

Follow Us