
సినిమా సినిమాకు హీరోలు వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సినిమాకు లుక్స్ మార్చుతూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. సినిమాకు తగ్గట్టుగా లుక్స్ తో పాటు బాడీ ల్యాగ్వేజ్ మార్చుకుంటూ ఉంటారు హీరోలు. అలాగే ఇప్పుడు ఓ స్టార్ హీరో కూడా లుక్ మొత్తం మార్చేశాడు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోని గుర్తుపట్టారా.? తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. లేటు వయసులో హీరోగా మారిన ఈ స్టార్ ఎవరో గుర్తుపట్టారా.? ఆయన ఎవరో కాదు. లెజెండ్ శరవణన్. మొన్నామధ్య ఆయన పేరు బాగా వినిపించింది. 50ఏళ్ల వయసులో హీరో అవ్వాలనే కలను నెరవేర్చుకున్నారు శరవణన్. ప్రముఖ వస్త్ర వ్యాపారం శరవణన్ స్టోర్స్ అధినేత అయిన శరవణన్ గతంలో తన బ్రాండ్ కు తానే యాడ్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో ట్రోల్స్ బారిన కూడా పడ్డారు.
ఇదిలా ఉంటే దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియన్ లెవల్లో.. లెజెండ్ సినిమాను తెరకెక్కించి అందర్నీ షాక్ చేశారు. షాక్ చేయడమే కాదు.. ఆ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్స్ ఇచ్చిమరీ స్టార్ టెక్నీషియన్లను తీసుకున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్తో.. థియేటర్లలో రిలీజ్ చేసి.. అందర్నీ ఆకట్టుకుంటున్నారు. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా లాంటి టాప్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకున్నారు.
తొలి సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఆయన, ఇప్పుడు రెండో సినిమాతో మరో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నారు. ఐదు పదుల వయసులో స్టార్ హీరో అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు లీడర్ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ టీజర్ లో ఓ యాక్షన్ సీన్ ను చూపించారు. కూతురి కోసం తండ్రి చేసే పోరాటంగా ఈ సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ఈ సినిమా కోసం భారీ తరగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఇప్పటికే పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. మరో బాలీవుడ్ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..