Bangarraju: బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా ?.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్.. కృతిశెట్టి ఎమోషనల్..

|

Nov 19, 2021 | 4:44 PM

అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న చిత్రం బంగార్రాజు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన

Bangarraju: బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా ?.. వీడియో షేర్ చేసిన చిత్రయూనిట్.. కృతిశెట్టి ఎమోషనల్..
Kriti Shetty
Follow us on

అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న చిత్రం బంగార్రాజు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగచైతన్య, కృతి శెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన సొగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సిక్వెల్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే బంగార్రాజు చిత్రం నుంచి కృతి శెట్టి లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఇందులో నాగలక్ష్మి పాత్రలో ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది.

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకెళ్తుంది కృతి శెట్టి. తాజాగా బంగార్రాజు సినిమాలో నాగచైతన్య సరసన నటిస్తోంది. ఇటీవల కృతికి సంబంధించిన పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసిన నాగలక్ష్మి లుక్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నికల్లో గెలిచి విజయకేతనం ఎగరేస్తున్నట్లుగా కృతిశెట్టి కనిపించింది. తాజాగా చిత్రయూనిట్ మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. బంగార్రాజు డైరీలో ఇంత అందం ఉందా ? అంటూ బంగార్రాజు డైరీకి సంబంధించిన వీడియో రిలీజ్ చేసింది. అందులో కృతి శెట్టి ఫోటోను రిలీజ్ చేశారు. అయితే బంగార్రాజు చిత్రయూనిట్ చేసిన పోస్ట్ పై కృతి శెట్టి స్పందించింది. తన మీద ఇంతలా ప్రేమ కురిపించినందుకు ఎమోషనల్ ట్వీట్ చేస్తూ… అభిమానులకు.. బంగార్రాజు టీంకు థ్యాంక్స్ చెప్పింది.

Also Read: Bigg Boss 5 Promo: బిగ్‍‏బాస్‏కు షాకిచ్చిన సిరి.. షణ్ముఖ్.. ప్రజలపై నమ్మకం ఉందంటూ..

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాపై కామెంట్ చేసిన నెటిజన్.. మూవీ టీం ఆన్సర్ అదుర్స్..

Megastar Chiranjeevi: తిరుపతి వరదలపై స్పందించిన మెగాస్టార్.. ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి చిరు విజ్ఞప్తి..