Krithi Shetty: ఉప్పెన బ్యూటీ తిరిగి ఎగసిపడేది ఆ సినిమాతోనేనా..? ఆ మూవీ పై ఆశాలు పెట్టుకున్న కృతి

|

Aug 14, 2022 | 3:56 PM

అదృష్టం అని సార్లు కలిసి రాదు.. మొదట్లో సక్సెస్ లు పలకరించినా ఆ తర్వాత ఫ్లాప్ లు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా తట్టుకోవాలి ప్రస్తుతం ఇదే స్టేజ్ లో ఉంది అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty) .

Krithi Shetty: ఉప్పెన బ్యూటీ తిరిగి ఎగసిపడేది ఆ సినిమాతోనేనా..? ఆ మూవీ పై ఆశాలు పెట్టుకున్న కృతి
Krithi Shetty
Follow us on

అదృష్టం అని సార్లు కలిసి రాదు.. మొదట్లో సక్సెస్‌లు పలకరించినా ఆ తర్వాత ఫ్లాప్ లు కూడా ఎదురవుతూ ఉంటాయి. వాటిని కూడా తట్టుకోవాలి ప్రస్తుతం ఇదే స్టేజ్ లో ఉంది అందాల భామ కృతి శెట్టి(Krithi Shetty). ఉప్పెన సినిమాతో డైరెక్ట్ గా కుర్రకారు గుండెల్లోకి దూకేసింది ఈ ముద్దుగుమ్మ. ఉప్పెన సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి ఓవర్ నైట్ క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆఫర్లు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది ఈ చిన్నది. ఉప్పెన సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నాగచైతన్య కు జోడీగా నటించిన బంగార్రాజు సినిమా కూడా హిట్ అయ్యింది. దాంతో ఈ భామ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ చిన్నదానికి ఊహించని షాక్ ఇచ్చింది రామ్ పోతినేని సినిమా.

రామ్ పోతినేని హీరోగా వచ్చిన ది వారియర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది కృతిశెట్టి. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. వారియర్ సినిమా డిజాస్టర్ అవవడంతో ఈ అమ్మడు నితిన్ సినిమా పై ఆశలు పెట్టుకుంది. నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం సినిమాలో నటించి కృతి. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో కృతికి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ అమ్మడు ఆశాలన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా పైనే.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పై ఇప్పటిదాకా బజ్ క్రియేట్ అవ్వలేదు. మరి ఈ సినిమా అయినా కృతి‌ని ఆశాలను నిలబెడుతుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి