Krithi Shetty Birthday : ఆకట్టుకుంటున్న అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్…

ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయింది ఈ బ్యూటీ. ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ నేషనల్ క్రాష్‌గా మార్చేసింది.

Krithi Shetty Birthday : ఆకట్టుకుంటున్న అందాల ముద్దుగుమ్మ కృతిశెట్టి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్...

Updated on: Sep 21, 2021 | 1:25 PM

Krithi Shetty Birthday : ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమాతో కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయింది ఈ బ్యూటీ. ఒకే ఒక్క సినిమా ఓవర్ నైట్ నేషనల్ క్రాష్‌గా మార్చేసింది. అమ్మడు ఎవరో కాదు అందాల కృతిశెట్టి. నేడు ఈ బ్యూటీ పుట్టిన రోజు.. ఉప్పెన సినిమాతో పరిచయం  సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మెగాఫ్యామిలీనుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు భారీ వసూళ్లను కూడా రాబట్టింది. ఈ సినిమాతో కృతిశెట్టికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగులో నటిస్తుంది ఈ బ్యూటీ. నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్  సినిమాలో నటిస్తుంది కృతి. అలాగే సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ఓ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది. అలాగే ఎనర్జిటిక్ స్టార్ రామ్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా కృతి హీరోయిన్‌గా నటిస్తుంది. అదేవిదంగా సుధీర్ బాబు నటిస్తున్న ఆ అమ్మాయిగురించి మీకు చెప్పాలి సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. రీసెంట్ గా నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజక వర్గం సినిమాతోపాటు.. చైతన్యకు జోడిగా బంగార్రాజు సినిమాలో నటిస్తుంది కృతి.

నేడు ఈ చిన్నదాని పుట్టిన రోజు సందర్భంగా ఆయా సినిమాలనుంచి కృత్రి పోస్టర్లను విడుదల చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు చిత్రయూనిట్. రామ్ సినిమానుంచి ఓరకంటితో చూస్తున్న అందమైన కృతి పోస్టర్‌ను విడుదల చేశారు.

నాని జోడీగా ఆమె చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్‌ను వదిలారు. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు.

సుధీర్ బాబు సరసన నాయికగా, ఇంద్రగంటి దర్శకత్వంలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తోంది. ఈ సినిమా టీమ్ కూడా కృతికి బర్త్ డే విషెస్ తెలియజేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us