
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. చివరగా గుంటూరు కారం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. పాన్ వరల్డ్ లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురూచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు పోకిరి. అప్పట్లో ఈ మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అంతేకాకుండా మాస్ యాక్షన్ హీరోగా మహేష్ బాబుకు ట్యాగ్ తీసుకువచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లోనే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని ముందే దివంగత కృష్ణ ఊహించారు. పోకిరి సినిమాలో ఇలియానా, ప్రకాష్ రాజ్, షాయాజీ షిండే, నాజర్, సుధ కీలక పాత్రలు పోషించారు. అలాగే మణిశర్మ అందించిన మ్యూజిక్ సైతం సూపర్ హిట్ అయ్యింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
అయితే ఈ సినిమాను ముందుగా రవితేజా లేదా పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారట. బద్రి సినిమాకు ముందే పోకిరి సినిమా కథను సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమా పేరు ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్యనారాయణ అని ఫిక్స్ చేసుకున్నారట. పంజాబ్ బ్యాగ్రౌండ్ లో ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేశారట. అయితే అదే సమయంలో రవితేజ నా ఆటోగ్రాఫ్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమా చివరకు మహేష్ వద్దకు చేరింది. ఇక పోకిరి సినిమాకు అయేషా టాకియా అనుకున్నారట. ఆ తర్వాత కంగనా రనౌత్ ను అనుకోగా.. ఆమె హిందీ సినిమా కోసం ఈ సినిమాను వదులుకుంది. చివరకు ఈ ప్రాజెక్టులో ఇలియానా వచ్చి చేరింది.
Raviteja
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..