
ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు వారంతా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే అప్పట్లో నటీమణులుగా అలరించినవారు కొందరు సినిమాలలో కొనసాగుతున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఓ సీనియర్ బ్యూటీ మళ్లీ సినిమాల్లో సందడి చేసేందుకు రెడీ అయ్యింది.1990 నుండి 2000 వరకు దక్షిణాది సినిమా రంగాన్ని ఏలిన తర్వాత ఆమె సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆ హీరోయిన్ తిరిగి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆమె కోసం సౌత్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె మరెవరో కాదు అందాల రాశి రంభ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..
రంభ 1993లో ప్రభు నటించిన ‘ఉళవన్’ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. అంతకు ముందు ఏడాదిలో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. మొదటి సినిమాతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించిన రంభ.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, రజినీకాంత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో కలిసి అనేక చిత్రాల్లో నటించింది. అలాగే అల్లు అర్జున్, పూరి కాంబోలో వచ్చిన దేశ ముదురు సినిమాలో స్పెషల్ సాంగ్ తో రచ్చ లేపింది.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
చివరగా 2010 పెన్ సింగం అనే సినిమాలో కనిపించింది. అదే ఏడాదిలో ఇంద్రకుమార్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన రంభ.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అయితే ఇప్పుడు ఆమె రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 16 సంవత్సరాల తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించనున్నట్లు సమాచారం.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..