Cinema : ఇదెం సినిమా రా బాబూ.. సంవత్సరాలు గడిచిన తగ్గని డిమాండ్.. ఇప్పటికీ ట్రెండింగ్..

సినీరంగంలో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించాయి. రిలీజ్ అయి ఏళ్లు గడిచినప్పటికీ పలు చిత్రాల డిమాండ్ ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా 2002లో థియేటర్లలోకి వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మరోసారి ఈ సినిమా పేరు తెరపైకి వచ్చింది.

Cinema : ఇదెం సినిమా రా బాబూ.. సంవత్సరాలు గడిచిన తగ్గని డిమాండ్.. ఇప్పటికీ ట్రెండింగ్..
Shakti The Power Movie

Updated on: Mar 21, 2026 | 9:28 AM

సాధారణంగా సినీరంగంలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. విడుదలై సంవత్సరాలు గడిచినప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఆ చిత్రాలను మళ్లీ మళ్లీ చూడాలని వెయిట్ చేస్తుంటారు అడియన్స్. తెలుగులోనే కాదు.. హిందీలోనూ అలాంటి చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఓ సినిమా పేరు సోషల్ మీడియాలో తెగ మారుమోగుతుంది. అదే శక్తి : ది పవర్. ముందుగా రొమాంటిక్ కథలా మొదలై.. ఆ తర్వాత దాదాపు 20 నిమిషాల్లోనే సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా మారుతుంది. డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రంలో కరిష్మా కపూర్, నానా పాటేకర్, సంజయ్ కపూర్ ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే షారుఖ్ ఖాన్, దీప్తి నవల్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. కథ ఎలా మలుపు తిరుగుతుంది అనేది చూస్తున్నంత సేపు ఆసక్తిగా సాగుతుంది. కథ విషయానికి వస్తే.. కథ నందిని (కరిష్మా కపూర్) శేఖర్ (సంజయ్ కపూర్) అనే దంపతుల చుట్టూ తిరుగుతుంది. కెనడాలో తమ కుమారుడితో కలిసి జీవిస్తుంటారు. ఒక రోజు శేఖర్ కు వచ్చిన ఫోన్ కాల్ తర్వాత ఇండియాకు వస్తారు. ఆ తర్వాత వీరిద్దరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి.

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

హింస, భయం, ప్రతీకారం అన్నీ కలిసిన ప్రమాదకర వాతావరణం ఉంటుంది. రొమాంటిక్ కథ అయినప్పటికీ కేవలం 20 నిమిషాల్లోనే క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా మారిపోతుంది. ఇది 1998లో వచ్చిన అంతఃపురం సినిమాకు రీమేక్. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ చిన్న పాత్రలో కనిపించారు. ఈ మూవీ విడుదలై దాదాపు 20 ఏళ్లు దాటినప్పటికీ.. ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

Follow Us