
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఓ చిన్న సినిమా సంచలనం సృష్టిస్తుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేరు.. యాక్షన్ సీన్స్ లేవు.. అయినా థియేటర్లలో సంచలనం సృష్టిస్తుంది. నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ ఇది. కేవలం 2 కోట్లతో నిర్మిస్తే.. దాదాపు రూ. 38 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా లిటిల్ హార్ట్స్. ఈ సినిమాలో శివానీ నగరంతో కలిసి యూట్యూబర్ మౌళి తనూజ్ ప్రశాంత్ నటించాడు. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై కృష్ణ, నిఖిల్ అబ్బూరి, రాజీవ్ కనకాల, ఎస్ఎస్ కాంచి, అనితా చౌదరి కీలకపాత్రలు పోషించింది. సింజిత్ యెర్రమిల్లి సంగీతంతో ఆదిత్య హసన్ నిర్మించిన ఈ చిన్న బడ్జెట్ చిత్రం యువ ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, బాలకృష్ణతో సూపర్ హిట్ సినిమాలు.. 55 ఏళ్ల వయసులోనూ స్టిల్ సింగల్.. ఇప్పటికీ యూత్‌లో యమ క్రేజ్..
ఈ చిత్రం 11 రోజుల్లోనే భారతదేశంలో రూ. 21.25 కోట్ల వసూల్లు రాబట్టింది. భారతదేశంలో రూ. 32.14 కోట్లు, విదేశాలలో రూ. 8 కోట్లు వసూలు చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 40.14 కోట్లు. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన లిటిల్ హార్ట్స్ 731 శాతం భారీ ROIతో రూ. 38.14 కోట్ల లాభాన్ని సాధించింది.
ఇవి కూడా చదవండి : Actress: అప్పుడు స్కూల్లో టీచర్.. తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
కేవలం ఒక వారంలోనే, ఈ చిత్రం 2025లో అత్యంత లాభదాయకమైన మూడు భారతీయ చిత్రాల జాబితాలోకి చేరింది. లిటిల్ హార్ట్స్ ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన తెలుగు చిత్రంగా కూడా నిలిచింది.
ఇవి కూడా చదవండి : Cinema: కాంతార, కేజీఎఫ్ చిత్రాలను వెనక్కు నెట్టింది.. అప్పుడు థియేటర్లు.. ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోన్న మూవీ..
ఇవి కూడా చదవండి : Tollywood : 19 ఏళ్ల వయసులో 31 ఏళ్ల స్టార్ హీరోతో పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..