
తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు సీఎంగా పదవీబాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందదే. నటుడి నుంచి రాజకీయనాయకుడిగా మారిన విజయ్ పుట్టిన రోజు నేడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి బర్త్‌డే అంటే ఎలా ఉండాలి. అద్దిరిపోవాలంటూ తమిళనాడులో తెగ హంగామా చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. రక్తదానాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. తమ అభిమాన నాయకుడు, నటుడు 52వ పుట్టినరోజుని మరిచిపోలేని విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న టీవీకే కార్యకర్తలు. ఇవాళ పుట్టిన చిన్నారులకు గిఫ్ట్‌లు అందజేశారు. విజయ్ మామ గిఫ్ట్ అంటూ చిన్నారులకు ఉంగరాలు అందజేశారు. బేబి కిట్స్‌ను సైతం తల్లులకు ఇచ్చారు విజయ్ ఫ్యాన్స్.
ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో విజయ్ ఆస్తుల వివరాలు ఒకటి. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల సమయంలో విజయ్ పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాలకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. ఈ రెండు చోట్ల విజయ్ ఘనవిజయం సాధించారు. కాగా ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 603.20 కోట్లుగా పేర్కొన్నారు.
ఆ లిస్ట్ ఒక్కసారి చూద్దాం.! విజయ్ చరాస్తులు: రూ. 404.58 కోట్లు (ఇందులో రూ. 213 కోట్లకు పైగా బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి). అలాగే స్థిరాస్తులు: రూ.198.62 కోట్లు (కోడైకనాల్‌లో వ్యవసాయ భూమి, చెన్నైలో నివాస, వాణిజ్య సముదాయాలు). అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.184.53 కోట్ల ఆదాయాన్ని ఆ అఫిడవిట్ లో చూపించారు విజయ్. అలాగే విజయ్ దగ్గర చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆయన గ్యారేజీలో BMW 530, టయోటా లెక్సస్, టయోటా వెల్‌ఫైర్, BMW i7 వంటి కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి.
ప్రశ్నలు & సమాదానాలు
ప్రశ్న : తమిళనాడు సీఎం విజయ్ భార్య పేరు ఏంటి.?
జవాబు : సంగీత
ప్రశ్న: సీఎం విజయ్ చివరి సినిమా ఏది.?
జవాబు : జన నాయగన్
ప్రశ్న: సీఎం విజయ్ మొత్తం ఎన్ని సినిమాలు చేశారు.?
జవాబు : లీడ్ యాక్టర్ గా మొత్తం 69 సినిమాలు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి