Srihari : శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ? ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే..

దివంగత నటుడు శ్రీహరి గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సినిమాల్లో సహయ నటుడిగా, విలన్ పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లిన ఆయన గుండెపోటుతో మరణించారు. శ్రీహరి మరణం ఇండస్ట్రీకి ఇప్పటికీ తీరని లోటు.

Srihari : శ్రీహరికి ప్రకాష్ రాజ్ ఏమవుతాడో తెలుసా.. ? ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే..
Prakash Raj, Srihari

Updated on: Feb 05, 2026 | 2:10 PM

సినీరంగంలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాష్ రాజ్. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు సహయ నటుడిగా, విలన్ పాత్రలతో మెప్పిస్తున్నారు. దశాబ్దాలుగా సినీ ప్రపంచంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన ముద్ర వేశారు. అయితే నటుడు ప్రకాష్ రాజ్, దివంగత నటుడు శ్రీహరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మీకు తెలుసా.. ? ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్, శ్రీహరి ఇద్దరు టాప్ యాక్టర్స్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా , హీరోగా నటించారు. వీరిద్దరు తోడళ్లుల్లు అవుతారు. శ్రీహరి భార్య డిస్కో శాంతి, అలాగే ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలతి కుమారి వరుసగా అక్కా చెల్లెలు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

తమిళ నటుడు సీఎల ఆనందన్ కూతుర్లు డిస్కోశాంతి, లలిత కుమారి. వీరిద్దరి సినీరంగంలోకి అడుగుపెట్టగా.. డిస్కో శాంతి డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకుంది. లలిత కుమారి తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. 1994లో ప్రకాష్ రాజ్, లలిత కుమారి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. కానీ కుమారుడు మరణించారు. 15 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

డిస్కో శాంతి, లలిత చెల్లెలు సుచిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె నటనకు దూరంగా ఉండడంతో అంతగా తెలియదు. తాము మొత్తం 7 మంది సంతానం అని అన్నారు. తన తండ్రి మరణించిన తర్వాత తన అక్క శాంతి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారని.. పెళ్లైన తర్వాత కూడా తాను కుటుంబానికి అండగా ఉందని అన్నారు. శ్రీహరి మరణించిన తర్వాత కూడా తమ కుటుంబాన్ని చూసుకున్నారని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

సుచిత్ర మాట్లాడుతూ.. ‘నేను అమ్మ ఎక్కువగా లతక్క, ప్రకాష్ రాజ్ వద్దే ఉన్నాము. అందుకే నాకు ప్రకాష్ రాజ్ బావ అంటే అభిమానం. శ్రీహారి బావ చనిపోవడం.. లతక్క నుంచి ప్రకాష్ రాజ్ బావ విడాకులు తీసుకోవడం మా కుటుంబానికి కోలుకోని దెబ్బతిన్నట్లుగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..