Bollywood: ఈ అందాల భామలు మన భారతీయులు కాదన్నా విషయం మీకు తెలుసా..?

సినిమా ఇండస్ట్రీ అందరిని ఆదరిస్తుంది. టాలెంట్ ఉంటే చాలు సినిమా ఇండస్ట్రీలో రాణించడం చాలా ఈజీ. ఇది చాలా మంది తారలు ఇది రుజువు కూడా చేశారు.

Bollywood: ఈ అందాల భామలు మన భారతీయులు కాదన్నా విషయం మీకు తెలుసా..?
Bollywood
Follow us

|

Updated on: Jul 30, 2022 | 12:09 PM

సినిమా ఇండస్ట్రీ అందరిని ఆదరిస్తుంది. టాలెంట్ ఉంటే చాలు సినిమా ఇండస్ట్రీలో రాణించడం చాలా ఈజీ. ఇది చాలా మంది తారలు ఇది రుజువు కూడా చేశారు. సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్(Bollywood)కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. అందాల భామలకు బాలీవుడ్ లో కొదవే లేదు. కొత్త అందాలు రోజుకొకరు పుట్టుకొస్తున్నా.. కొంతమంది మాత్రం తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు. అయితే ఈ భామలు భారతీయులు కాదట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. బాలీవుడ్ లో రాణిస్తున్న ముద్దుగుమ్మల్లో పలువురు వేరే దేశాలకు చెందిన వారు.. వారు ఎవరంటే..

అలియా భట్:

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అలియా భట్. ప్రముఖ దర్శకుడు మహేశ్​భట్ కూతురన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్స్ లో ఒకరు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి మెప్పించింది ఈ చిన్నది. అలాగే స్టార్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లాడింది ఈ అమ్మడు. అయితే అలియా భట్ లండన్ లో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి మహేష్ భట్ ఇండియన్ కాగా తల్లి సోనీ రజ్దాన్ బ్రిటీష్ నటి. లండన్ లో పుట్టిన ఈ అమ్మడుకు బ్రిటీష్ పౌరసత్వం కలిగి  ఉంది.

ఇవి కూడా చదవండి
Alia Bhatt

 

కత్రినా కైఫ్ 

కత్రినా కైఫ్.. అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ లో కత్రినా ఒకరు. ఇటీవలే విక్కీ కౌశల్ ను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు కూడా బ్రిటీష్ పౌరసత్వం కలిగి  ఉంది. కత్రినా హాంగ్​కాంగ్​లో పుట్టి పెరిగింది.

Katrina Kaif

 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ పేరు ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయ్యింది. ఇటీవలే కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో కలిసి విక్రాంత్ రోణ సినిమాలో నటించింది. ఈ ముద్దుగుమ్మ శ్రీలంక కు చెందింది.

Jacqueline

 

నర్గీస్ ఫక్రీ

రణబీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ సినిమాతో పరిచయం అయ్యింది నర్గీస్ ఫక్రీ. ఆ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. న్యూయార్క్ లో పుట్టిన ఈ చిన్నది అమెరికా పౌరసత్వం కలిగి ఉంది.

Nargis Fakhri

 

అక్షయ్ కుమార్: 

స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా భారత పౌరసత్వం కలిగి లేడు. పంజాబ్​లోని అమృత్​సర్​లో పుట్టి పెరిగినా అక్షయ్ కెనడా పాస్​పోర్ట్​ కోసం భారత పౌరసత్వాన్ని వదలుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోల్లో అక్షయ్ ఒకరు. ఏడాదికి తక్కువలో తక్కువ నాలుగు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్.

Akshay Kumar

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి