Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం మతం మార్చుకున్న టాలీవుడ్ హీరోయిన్..

నిన్నమొన్నటివరకు కనిపించిన చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు కనబడుటలేదు. సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. వరుస సినిమాతో హీరోయిన్స్ గా అలరించిన చాలా మంది భామలు ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. అలంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగు,హిందీ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

Tollywood : ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం మతం మార్చుకున్న టాలీవుడ్ హీరోయిన్..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 05, 2025 | 4:16 PM

సినిమా ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించాయి. చాలా మంది హీరోలు, హీరోయిన్స్ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొంతమంది తమ చిన్ననాటి స్నేహితులను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరికొంతమంది హీరోయిన్స్ హీరోలను పెళ్లాడారు. ఇక ఇండస్ట్రీలో మతం మార్చుకున్న వారు కూడా ఉన్నారు. అయితే ఓ హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి మతం మార్చుకుంది. ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం మతం మార్చుకుంది ఓ హీరోయిన్. అయితే ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు. పెళ్ళైన దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ విషయం బయటపడింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమెకు కుర్రాళ్లలో విపరీతమైన క్రేజ్ ఉంది. కానీ పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరంటే..?

తెలుగులో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ సినిమా గుర్తుందా.? నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలుకోలేకపోయింది. ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఆయేషా టాకియా. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది ఈ చిన్నది. కానీ తెలుగులో అంతగా అవకాశాలు రాబట్టలేకపోయింది. తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారింది. కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ప్రముఖ వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది ఆయేషా టాకియా. ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకోవడానికి అయేషా టాకియా మతాన్ని మార్చుకుంది. ఫర్హాన్ అజ్మీతో మూడేళ్లు డేటింగ్ చేసింది ఈ చిన్నది. సమాజ్వాద్ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీ. అతను రెస్టారెంట్స్ బిజినెస్ ల్లో రాణిస్తున్నాడు. ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకోవడానికి తన మతాన్ని మార్చుకొని ఆయేషా టకియా అజ్మీగా మారిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన పెళ్లి సంగతులను పంచుకుంది.

అయేషా టాకియా ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి