థియేటర్స్‌లో పట్టించుకోలేదు.. కానీ ఓటీటీని ఊపేస్తోంది.. దీన్ని కొట్టే సినిమా లేదంటున్న నెటిజన్స్

ఓటీటీల వాడకం పెరిగిన తర్వాత ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలను ఎంజాయ్ చేస్తూనే.. ఓటీటీలో రకరకాల జోనర్స్ లో సినిమాలు చూస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీ సినిమాల్లో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, క్రైమ్ సస్పెన్స్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

థియేటర్స్‌లో పట్టించుకోలేదు.. కానీ ఓటీటీని ఊపేస్తోంది.. దీన్ని కొట్టే సినిమా లేదంటున్న నెటిజన్స్
Ott Movie

Updated on: Mar 13, 2026 | 12:33 PM

శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. పెద్ద సినిమాలతోపాటు చిన్న సినిమాలు కూడా ఓటీటీలో విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, గేమ్ షోలు ఆకట్టుకుంటున్నాయి. తెలుగు సినిమాలే కాదు ఇతరభాషల సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ఓటీటీల్లో ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో దర్శనమిస్తున్నాయి. ఇక థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలకు కొదవే లేదు.. ఇక ఇప్పుడు ఓ హారర్ సినిమా ఓటీటీని షేక్ చేస్తుంది. ఇలాంటి సినిమాను థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యాం అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు.

ఆ సినిమానే హారర్ థ్రిల్లర్ తుంబాడ్. ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాల్సిందే.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే.. మైథలాజికల్ హారర్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన ఈ మూవీకి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా ద‌ర్శక‌త్వం వ‌హించారు. ఈ మూవీ రిలీజ్ అయిన సమయంలో పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఆతర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ మూవీని చాలా మంది చూసి ఇష్టపడ్డారు. ఇప్పటికీ ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదు. ఈ క్రమంలో తుంబాడ్ సినిమాను మొన్నామధ్య రీ రిలీజ్ చేశారు.

రీ రిలీజ్‌లో తుంబాడ్ సినిమా దుమ్మురేపింది. ఈ తుంబాడ్ బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాలు సృష్టించింది. ఏకంగా ఈ సినిమా రీ రిలీజ్‌లో రూ. 30కోట్లు వసూల్ చేసింది. 2018లో చిన్న సినిమాగా విడుదలైన ‘తుంబాడ్’ అప్పుడు కేవలం రూ. 12కోట్లు రాబట్టింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేశారు. ఇక రీ రిలీజ్‌లో ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియాలో రీ రిలీజ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తుంబాడ్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అంతే కాదు.. అమెజాన్ లో టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ లోనూ కంటిన్యూ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us