
ఆర్టిస్ట్‌గా కొనసాగుతూ ఉండగానే.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో కర్రీ పాయింట్స్ స్టార్ట్ చేసిన కిర్రాక్ ఆర్పీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. నెల్లూరు స్టైల్ వేరే ఉంటుంది అని.. తాను చేపలతో పాటు పులుసులో వేసే అన్ని మసాలా దినుసులు.. నెల్లూరు నుంచే తెప్పినట్లు చెప్పాడు. అంతేకాదు ఆ పులసు పెట్టే వర్కర్స్‌ను సైతం నెల్లూరు నుంచే రప్పించినట్లు అప్పట్లో వివరించాడు. దీంతో ఈ ఫుడ్ లవర్స్ అప్పట్లో ఈ పులసు రుచి చూసేందుకు క్యూ కట్టారు. అయితే ఈ పులుసుపై మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. కర్రీ అంత టేస్ట్ లేదని.. రేటు ఎక్కువగా ఉందని కొందరు కామెంట్స్ చేశారు. అయితే ఆర్పీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా వరుస బ్రాంచులు ఓపెన్ చేసి హడావిడి చేశాడు. అంతేకాదు డబ్బులు తీసుకుని పలు ప్రాంఛైజీలు కూడా ఇచ్చాడు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఆయన ఉన్నఫలంగా ఈ బిజినెస్‌కు క్లోజింగ్ బోర్డు పెట్టేశాడు. ఆపై రాజకీయాల్లో బిజీ అయ్యాడు. టీడీపీ తరుఫున ప్రచారం చేయడంలో కీ రోల్ పోషించాడు. అంత మంచిగా ఉన్న బిజినెస్ ఎందుకు క్లోజ్ చేశాడో తాజాగా క్లారిటీ ఇచ్చాడు ఆర్పీ.
జీవితంలో ప్రయాణించే క్రమంలో.. ఆ ఫుడ్ బిజినెస్ ఒక పార్ట్ అని.. అలానే పాలిటిక్స్ కూడా ఒక భాగమని వివరించాడు. రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల చేపల పులసు బిజినెస్ నుంచి తప్పుకున్నట్లు వివరించాడు. ఇక తన రాజకీయ భవిష్యత్‌పై ఆయన క్లారిటీ ఇచ్చాడు. తన పదవి ఇస్తారనే ప్రచారం ఉందని.. ఏదైనా బాధ్యత ఇస్తే తీసుకునేందుకు తాను రెడీ అని చెప్పాడు. తన స్థాయి, అర్హత బట్టి ఏదైనా పదవి ఇస్తే.. బాధ్యతతో అవినీతి రహితంగా పని చేస్తానని వివరించాడు. టీడీపీ తరుపున నిజాయతీగా పనిచేస్తానని వివరించాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.