
కేజీఎఫ్ 2 రిలీజ్ అయి ఐదు నెలలవుతోంది. అయినా ఇంకా రాకీభాయ్ లుక్‌లోనే ఉన్నారు యష్. నెక్ట్స్ సినిమా విషయంలో రకరకాల న్యూస్ వైరల్ అవుతున్నా రాకీ మాత్రం వెయిట్ అండ్ సీ అంటూ ఊరిస్తున్నారు. ఈ టైమ్‌లోనూ కేజీఎఫ్ 3కి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సాండల్‌వుడ్‌లో సర్క్యులేట్ అవుతోంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ వైబ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న యష్… ఇంకా రాకీ భాయ్ లుక్‌లోనే కనిపిస్తున్నారు. దీంతో యష్ నెక్ట్స్ మూవీ కేజీఎఫ్ పార్ట్ 3 అన్న టాక్ బలంగా వినిపించింది. కానీ ఈ రూమర్స్‌కు చెక్ పెట్టేశారు యష్… ఇప్పట్లో కేజీఎఫ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు.
యష్, టైమ్ ఉందని చెబుతున్నా నిర్మాతలు మాత్రం కేజీఎఫ్ 3కి గ్రౌండ్ రెడీ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ సినిమాకు ముందు అనుకున్న కథ వేరు. పీరియాడిక్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ కాస్ట్యూమ్ డ్రామాగా ఓ కథను సిద్దం చేశారు ప్రశాంత్ నీల్. కానీ యష్ ఐడియాతో పూర్తి కథను పక్కన పెట్టి అందులో కొంత భాగాన్నే కేజీఎఫ్ 1, 2గా తెరకెక్కించారు.
రెండు భాగాలు సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు మిగత కథను మూడోభాగంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గతంలో పక్కన పెట్టిన పీరియాడిక్ కాన్సెప్ట్ మీద మరోసారి వర్క్ చేసి ఆ కథతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌లో యష్… రాజుగా కనిపిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలో అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని టాలీవుడ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.