
ఎవరేమనుకున్నా డోంట్ కేర్. తాను అనుకున్నది చెప్తుంది. వివాదాలు చుట్టుముడుతున్నా తాను నమ్మిన సిద్దాంతాన్ని ఫాలో అవుతుంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. సుశాంత్ అనుమానాస్పద మరణం తర్వాత బాలీవుడ్లో నెపొటిజంపై ఆమె పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. కాగా ఇటీవల కాలంలో ప్రధాని మోదీకి సపోర్ట్‌గా మాట్లాడుతూ వస్తుంది. దీంతో ఆమె రాజకీయాల్లోకి రాబోతుందంటూ వార్తలు సర్కులేట్ అయ్యాయి. తనకు చాలా పార్టీలు టికెట్లు ఆఫర్ చేశాయని, కానీ తనకు రాజకీయాలంటే ఇంట్రస్ట్ లేదని కుండబద్దలు కొట్టింది కంగనా.
“నేను పాలిటిక్స్‌లోకి రావాలని కోరుకుంటున్నందు వల్లనే ప్రధానికి మద్దతు ఇస్తున్నానని భావించే ప్రతి ఒక్కరికీ ఒక విషయం క్లియర్‌గా చెప్తున్నా. మా తాత వరుసగా 15 ఏళ్లు కాంగ్రెస్ శాసనసభ్యుడిగా పనిచేశారు. అందుకే ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా తర్వాత దాదాపు ప్రతి ఏడాది కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ వచ్చేది. ‘మణికర్ణిక’ చిత్రం తర్వాత బీజేపీ నుంచి కూడా నాకు టికెట్ ఆఫర్ చేశారు. ఒక ఆర్టిస్ట్‌గా నా వర్క్ అంటే నాకు ఎంతో ప్రేమ. పాలిటిక్స్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎవరికి సపోర్ట్‌గా నిలవాలనేది నా పర్సనల్ విషయం” అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.
Also Read :
పవన్ అభిమాని ప్రాణానికి సీఎం జగన్ అభయం
అలెర్ట్ : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
విశాఖ జిల్లాలో భారీ వర్షాలు…సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు