Kamal Haasan: కమల్ హాసన్ సినిమా షూటింగ్‏కు అతిథిగా బ్రిటన్ మహారాణి ఎలిజబెత్.. ఏ మూవీ అంటే..

|

Sep 09, 2022 | 3:50 PM

ఈ క్రమంలో లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఆమెతో ఉన్న మధురమైన జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు. ఆమె మరణవార్త తనకు చాలా బాధ కలిగించిందంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.

Kamal Haasan: కమల్ హాసన్ సినిమా షూటింగ్‏కు అతిథిగా బ్రిటన్ మహారాణి ఎలిజబెత్.. ఏ మూవీ అంటే..
Kamal Haasan
Follow us on

బ్రిటన మహారాణి క్వీన్ ఎలిజబెత్ -2 గురువారం రాత్రి కన్నుమూశారు. 96 ఏళ్ల ఎలిజబెత్ -2 స్కాట్‏లాండ్‏లోని బల్మోరల్ క్యాజిల్‏లో తుదిశ్వాస విడిచింది. ఆమె మరణ వార్త యావత్ ప్రపంచాన్ని దిగ్ర్బాంతికి గురిచేసింది. 1952 ఫిబ్రవరి 6 నుంచి దాదాపు 70 ఏళ్ల పాటు బ్రిటన్ దేశానికి మహారాణిగా ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ -2 (Queen Elizabeth ) మరణంలో మన దేశ ప్రధాని నరేంద్రమోదీ, రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఆమెతో ఉన్న మధురమైన జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నారు. ఆమె మరణవార్త తనకు చాలా బాధ కలిగించిందంటూ ఆమెతో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు.

“ఇంగ్లండ్ క్వీన్ ఎలిజబెత్ II మరణవార్త బాధ కలిగింది. ఆమె డెబ్బై సంవత్సరాల పాటు రాణిగా కొనసాగింది. కేవలం బ్రిటిష్ ప్రజలు మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం ఆమెపై ప్రేమను చూపించింది. 25 సంవత్సరాల క్రితం ఆమె మా ఆహ్వానాన్ని అంగీకరించి, మరుధనయాగం చిత్రీకరణ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆమె హాజరైన ఏకైక సినిమా షూటింగ్ ఇదే అనుకుంటాను. 5 సంవత్సరాల క్రితం ఆమెను ప్యాలెస్‌లో లండన్‌లో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో కలుసుకోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె మరణం పట్ల బ్రిటిష్ ప్రజలకు.. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ రాసుకొచ్చారు కమల్.

1997లో కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ మరుదనాయగం సినిమా ప్రారంభించారు. ఈ వేడుకకు క్వీన్ ఎలిజబెత్ -2 ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దాదాపు రూ. 1.5 కోట్లతో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. దాదాపు 20 నిమిషాల పాటు మహారాణి ఈ మూవీ సెట్ లో గడిపారు. కమల్ హాసన్ దర్శకత్వం వహించి.. సుమారు రూ. 80 కోట్లతో నిర్మించాలనుకున్నారు. కానీ అనివార్య కారణాలతో ఈ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. నిర్మాణానికి ముందుకు వచ్చిన ఓ ఇంటర్నేషనల్ కంపెనీ అనుకోకుండా వెనక్కి వెళ్లిపోవడంతో షూటింగ్ దశలోనే ఆగిపోయింది.