Bimbisara Movie: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ బింబిసార నుంచి న్యూ పోస్టర్..

నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. చిన్న గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు బింబిసార సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

Bimbisara Movie: ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ బింబిసార నుంచి న్యూ పోస్టర్..
Bimbisara

Updated on: May 28, 2022 | 7:12 PM

నందమూరి కళ్యాణ్ రామ్(kalyan ram) సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. చిన్న గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు బింబిసార(Bimbisara )సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది. రీసెంట్ ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేశారు చిత్రయూనిట్. బింబిసార చిత్రాన్ని ఆగ‌స్ట్ 5న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుద‌లైన క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

నేడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ బింబిసార సినిమానుంచి ఆకట్టుకునే పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కల్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ రెండు లుక్స్ తో డిజైన్ చేశారు. చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా కేథరిన్ .. సంయుక్త మీనన్ .. వార్నియా హుస్సేన్ అలరించనున్నారు.

ఇవి కూడా చదవండి

Kalyan Ram

NTR Jayanti 2022: ఎన్టీఆర్ జయంతికి తెలుగు జాతి కీర్తి కిరీటం అంటూ ఘన నివాళులర్పించిన మెగా బ్రదర్స్.. చిరు,పవన్‌లు
Ram Gopal Varma: ‘నన్నే మోసం చేస్తారా.. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’: రామ్ గోపాల్ వర్మ
Shamna Kasim: నాటీ లుక్స్ తో నయా ఫోజులు.. ఢీ పూర్ణ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్

Loading...
Unable to load recommendations.
Follow Us