Kalyan Dev’s Super Machi : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘సూపర్ మచ్చి’.. ఆకట్టుకుంటున్న టీజర్

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ సరైన సక్సెస్ కోసం ఎదురుచుస్తున్నాడు. విజేత సినిమాతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిన్నల్లుడు..

Kalyan Devs Super Machi : లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సూపర్ మచ్చి.. ఆకట్టుకుంటున్న టీజర్
Kalyan Dev

Updated on: Nov 04, 2021 | 5:16 PM

Super Machi : మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ సరైన సక్సెస్ కోసం ఎదురుచుస్తున్నాడు. విజేత సినిమాతో హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిన్నల్లుడు.. ఆ సినిమాతర్వాత ఇప్పటివరకు మారే  సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సూపర్ మచ్చి , కిన్నెరసాని అనే సినిమాలను చేస్తున్నాడు. నేడు దీపావళి కానుకగా సూపర్ మచ్చి సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరోనా తర్వాత ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగింది.

మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరపరిచిన ఐదు పాటలు ‘సూపర్ మచ్చి’ సినిమాకు బలం కానున్నాయని అంటున్నారు.ఈ సినిమాలో కళ్యాణ్ దేవ్, రచితా రామ్, రాజేంద్రప్రసాద్, నరేష్‌తో పాటు ప్రగతి, అజ‌య్‌, పోసాని కృష్ణమురళి, ‘జబర్దస్త్’ మహేష్, భద్రం, పృథ్వీ, ఫిష్ వెంకట్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: నెక్స్ట్ లెవల్.. బాలయ్య విశ్వరూపం.. అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో అదిరిందిగా..

Shakini -Dakini: ఇద్దరు ముద్దుగుమ్మల యాక్షన్ సీక్వెన్స్‌లు.. “శాకిని -డాకిని”గా రెజీనా, నివేద

Peddanna : రజినీకాంత్ గారు ఇచ్చిన అతి పెద్ద ప్రశంస అదే.. ఆసక్తికర విషయం వెల్లడించిన దర్శకుడు శివ..

Loading...
Unable to load recommendations.
Follow Us