ఇన్​స్టాలో కాజల్ క్రేజీ రికార్డ్‌

|

Sep 06, 2020 | 7:53 AM

చందమామ కాజ‌ల్ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచూ అభిమానుల‌ను అల‌రిస్తోంది.

ఇన్​స్టాలో కాజల్ క్రేజీ రికార్డ్‌
Follow us on

చందమామ కాజ‌ల్ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. తన ఆన్ స్క్రీన్‌, ఆఫ్ స్క్రీన్ అప్​డేట్స్​ను ఎప్పటికప్పుడు అందిస్తుంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ‌.

తాజాగా కాజల్ ఇన్​స్టాగ్రామ్​లో క్రేజీ ఫీట్ సొంతం చేసుకుంది. ఈ డిజిటల్ మాధ్యమంలో 15 మిలియన్ ఫాలోవర్ల మార్క్​కు అందుకుంది. దీంతో అభిమానులు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఆచార్య’లో నటిస్తోంది. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లో ఛాన్స్ కొట్టేసింది. మంచు విష్ణు సినిమా మోస‌గాళ్ళు లో కీలక పాత్ర పోషిస్తోంది.

Also Read :

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం

శిరోముండనం కేసులో నూతన్​ నాయుడుకు రిమాండ్