
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏప్రిల్ 19న ఉదయం 7గంటలకు ముంబయ్‌లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో మగబిడ్డ జన్మనిచ్చిందని సమాచారం. అయితే ఈ విషయాన్ని కాజల్ దంపతులు అధికారికంగా దృవీకరించలేదు. కానీ బాలీవుడ్ ప్రముఖ సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా కాజల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తమ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేయడానికి కాజల్ దంపతులు మరింత సమయం తీసుకుంటుందా లేదా అనేది చూడాలి. ప్రెగ్నెన్సీ సమయంలోనూ కాజల్ వరుస ఫోటోషూట్స్.. ప్రెగ్నెన్సీ ప్రకటనలలో నటిస్తూ బిజీగా గడిపేసింది.
కాజల్ అక్టోబర్ 30, 2020న తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంది. కోవిడ్ కారణంగా కుటుంబసభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ టాలీవుడ్ చిత్రాల నుంచి తప్పుకున్న సంగతి తెలసిందే. కాజల్ చివరి సారిగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీలో నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: The Kashmir Files: ఓటీటీలోకి ది కాశ్మీర్ ఫైల్స్ ?.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
Upasana Konidela: గోల్డెన్ టెంపుల్లో ఉపాసన సందడి.. చరణ్‌కు బదులుగా నేనొచ్చానంటూ పోస్ట్..
Siddarth: స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన సిద్ధార్థ్..